ఈరోజు స్టాక్ మార్కెట్ వార్తలు – 10.Mar.2025

ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో SENSEX – 74,115 (-217 పాయింట్లు), Nifty 22,460 (-92 పాయింట్లు), Bank Nifty (-217 పాయింట్లు) నష్టపోయాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఆటో మరియు మెటల్ విభాగాల్లో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. FMCG విభాగాలు కొంత లాభాలను నమోదు చేశాయి. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు కూడా కొంత క్షీణించాయి. టారిఫ్ చర్చలు మరియు ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు మన దేశ మార్కెట్లను ప్రభావితం చేశాయి.

ఈ రోజు టాప్ గెయినర్స్‌గా POWER GRID CORP, HUL, Infosys, SBI Life Insurance మరియు NESTLE నిలవగా, టాప్ లూజర్స్‌గా ONGC, Trent, IndusInd Bank, Bajaj Auto మరియు Eicher Motors నిలిచాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ రోజు ₹87.26 ఉండగా, 24K బంగారం విలువ 1 గ్రాముకు ₹8,150 ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *