IPL 2025 మ్యాచ్ No.53 కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ సూపర్ థ్రిల్లర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 1 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగి అభిమానులకు మంచి అనుభూతిని అందించింది. సీజన్‌లో కొనసాగేలా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో KKR జట్టు విజయాన్ని దక్కించుకుని సెమీస్ అవకాశాలను మెరుగు పరుచుకుంది. వేగంగా పరుగులు సాధించి మంచి ప్రదర్శన కనబరిచిన ఆండ్రే రస్సెల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానె ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

బ్యాటింగ్‌లో అదరగొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు బ్యాట్స్‌మెన్ మంచిగా రాణించారు. ఈ ఇన్నింగ్స్‌లో గొప్ప ప్రదర్శన కనబరిచిన కోల్‌కతా జట్టు సభ్యులు తమ వంతు పాత్ర పోషించగా, ఆండ్రే రస్సెల్ పవర్ హిట్టింగ్‌తో చెలరేగిపోయాడు. KKR బ్యాటింగ్‌లో 57 పరుగులు సాధించిన రస్సెల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్‌లో ఆర్చర్, యుధ్వీర్ సింగ్, తీక్షణ మరియు రియాన్ పరాగ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

పట్టువీడకుండా పోరాడిన రాజస్థాన్ రాయల్స్
207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇన్నింగ్స్ చివరి దాకా పోరాడింది. KKR జట్టు విజయంకోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ 95 పరుగులతో చెలరేగిపోయినా, మిగతా బ్యాటర్లు అతనికి సరైన సహకారం అందించకపోవడం కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమి పాలైంది. KKR జట్టు బౌలింగ్‌లో మోయిన్, వరుణ్, హర్షిత్ రానా తలో 2 వికెట్లు సాధించగా, వైభవ్ అరోరా 1 వికెట్ దక్కించుకున్నాడు.
for more IPL updates visit Sports