IPL 2025 మ్యాచ్ నెం.39లో గుజరాత్ టైటాన్స్ జట్టు 39 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ పై విజయాన్ని సాధించింది. ఈ సీజన్ మొత్తం మంచి ప్రదర్శన కనబర్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కొనసాగించిన గుజరాత్ జట్టు బౌలర్లు కోల్‌కతా జట్టును కట్టడి చేశారు. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్ మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్
గుజరాత్ జట్టు ఓపెనర్లు గిల్ మరియు సాయి సుధర్షన్ మంచి ప్రదర్శన ఈ సీజన్‌లో కొనసాగిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో వికెట్ కోల్పోకుండా 45 పరుగులు సాధించారు. గుజరాత్ జట్టు మొదటి వికెట్ కోల్పోయే సరికి ఈ జోడీ 12 ఓవర్లలో 114-1 పరుగుల స్కోర్ సాధించింది. రస్సెల్ బౌలింగ్‌లో సాయి సుధర్షన్ 52 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బట్లర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ 58 పరుగుల భాగస్వామ్యం చేసిన తర్వాత గిల్ 90 పరుగుల వద్ద వైభవ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. చివర్లో వేగంగా 41 పరుగులు చేసిన బట్లర్ గుజరాత్ జట్టు స్కోరును 198 పరుగులకు చేర్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్‌లో రస్సెల్, రానా మరియు వైభవ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

గాడి తప్పిన కోల్‌కతా నైట్ రైడర్స్
199 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఏ దశలోనూ విజయం వైపు సాగలేకపోయింది. పవర్‌ప్లే నుంచే ఇబ్బందులు ఎదుర్కొన్న KKR జట్టులో రహానే 50 పరుగులు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ స్కోరు సాధించడంలో విఫలమయ్యారు. వరుసగా వికెట్లు కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ 39 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నారు. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన గుజరాత్ బౌలర్లలో ప్రసీద్, రషీద్ తలో 2 వికెట్లు సాధించగా, సిరాజ్, ఇషాంత్, సుందర్ మరియు సాయి కిషోర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
for more IPL updates visit Sports