ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.14లో గుజరాత్ టైటాన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఇరు జట్లు మంచి ప్రదర్శన కనబరిచిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో 13 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన మహమ్మద్ సిరాజ్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డును అందుకున్నాడు. చిన్నస్వామి మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలో దెబ్బతిన్న RCB

మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్‌ప్లేలోనే ఆ జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ 7, పదిక్కల్ 4, ఫిల్ సాల్ట్ 14 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసి బెంగళూరు జట్టుకు గట్టి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పటీదార్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. లివింగ్‌స్టోన్‌తో కలిసి జితేశ్ శర్మ స్కోర్‌బోర్డును ముందుకు తీసుకెళ్లగా, ఐదో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ఏర్పాటైంది. అనంతరం లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్ కలిసి 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బెంగళూరు జట్టు తరఫున లివింగ్‌స్టోన్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టైటాన్స్ బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీయగా, సాయి కిషోర్ 2 వికెట్లు, అర్షద్, ప్రసిద్ధ్, ఇషాంత్ తలా ఒక్కో వికెట్ సాధించారు.
సునాయాసంగా ఛేదించిన గుజరాత్ టైటాన్స్

170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఆడి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లక్ష్యానికి అవసరమైన రన్‌రేట్ తక్కువగా ఉండటంతో గుజరాత్ సునాయాసంగా పరుగులు చేశారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 42/1గా ఉంది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జోస్ బట్లర్ 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. అలాగే ఓపెనర్ సాయి సుధర్శన్ 49 పరుగులు చేశాడు. చివర్లో షెర్ఫేన్ రుదర్‌ఫోర్డ్‌తో కలిసి బట్లర్ మరోసారి మెరుపులు మెరిపించి, 13 బంతులు మిగిలుండగానే గుజరాత్ టైటాన్స్‌కు గెలుపును అందించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్‌లో భువనేశ్వర్, హజెల్‌వుడ్ ఒక్కొక్క వికెట్ సాధించగా, మిగతా బౌలర్లు ఆశించిన ప్రదర్శన చేయలేకపోయారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ తమ పాయింట్స్ టేబుల్ స్థానాన్ని మరింత బలపరచుకుంది.
For IPL updates visit Sports