Headlines

గుజరాత్ టైటాన్స్ 38 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ పై విజయం

గుజరాత్ టైటాన్స్

IPL 2025 మ్యాచ్ నం.51 సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య చోటు చేసుకుంది. పూర్తి ఆధిపత్యం సాధించిన గుజరాత్ టైటాన్స్ జట్టు సన్‌రైజర్స్‌ను, హైదరాబాద్ జట్టును దెబ్బకొట్టింది. బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ధ్ క్రిష్ణా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు.

గుజరాత్ టైటాన్స్ టాప్ పర్ఫార్మెన్స్

గుజరాత్ టైటాన్స్

ఈ సీజన్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టిన గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మరోసారి విజృంభించారు. సాయి సుదర్శన్ మరియు శుభ్‌మన్ గిల్ పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా ఈ జోడీ 82 పరుగులు సాధించారు. హిట్టింగ్‌తో అదరగొట్టిన ఈ జోడీ 87 పరుగుల భాగస్వామ్యం సాధించారు. 76 పరుగులు సాధించి గిల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తరువాత బట్లర్ 64 పరుగులు సాధించి జట్టు స్కోర్‌ను 224 పరుగులకు చేర్చారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్‌లో ఉన్నద్కత్ 3 వికెట్లు సాధించగా కమిన్స్ మరియు అంసారీ చెరో వికెట్ దక్కించుకున్నారు.

SRH ని కట్టడి చేసిన గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్

225 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ప్రారంభం నుంచే వేగంగా పరుగులు సాధించకుండా గుజరాత్ జట్టు కట్టడి చేసింది. సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతూ ఉన్నా విజయానికి కావలసిన పరుగులు సాధించలేక SRH బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‌లో 74 పరుగులు సాధించి అభిషేక్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగతా బ్యాటర్స్ నిరాశ పరిచారు. గుజరాత్ బౌలింగ్‌లో సిరాజ్ మరియు ప్రసిద్ధ్ క్రిష్ణా చెరో 2 వికెట్లు సాధించగా, కోయెట్జీ, ఇషాంత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో గుజరాత్ జట్టు పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానం చేరుకుంది.

for more IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *