IPL 2025 మ్యాచ్ నం.67 చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్. పాయింట్స్ టేబుల్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. అన్ని విభాగాల్లో అలరించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను 83 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. హిట్టింగ్‌తో చెలరేగిపోయిన డేవాల్డ్ బ్రెవిస్ 23 బంతుల్లో 57 పరుగులు చేసి మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

హిట్టింగ్‌తో చెలరేగిపోయిన చెన్నై సూపర్ కింగ్స్
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఆయుష్ మాథ్రే 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికీ చెన్నై జట్టు 68/1 పరుగులు చేసింది. చెన్నై జట్టు బ్యాటర్స్ అందరూ వేగంగా పరుగులు సాధించి జట్టు స్కోరును 230 పరుగులకు చేర్చారు. 57 పరుగులు చేసి బ్రెవిస్ టాప్ స్కోరర్‌గా నిలవగా, కాన్వే 52 పరుగులు, ఉర్విల్ పటేల్ 37 పరుగులు, శివమ్ దూబే 17 పరుగులు మరియు జడేజా 21 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలింగ్‌లో ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు సాధించగా, రషిద్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
గుజరాత్ టైటాన్స్ జట్టును చిత్తు చేసిన CSK
ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో దారుణంగా ఓటమి పాలైంది. సాయి సుదర్శన్ 41 పరుగులు తప్ప మిగితా బ్యాటర్స్ అందరూ త్వరగా వికెట్లు కోల్పోయేసరికి గుజరాత్ టైటాన్స్ జట్టు 147 పరుగులకే ఆలౌట్ అయింది. అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అంషుల్ కాంబోజ్ మరియు నూర్ అహ్మద్ తలో 3 వికెట్లు సాధించగా, జడేజా 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్ మరియు పథిరానా తలో వికెట్ దక్కించుకున్నారు.

for more IPL updates visit Sports