Headlines

గెలుపుతో నిష్క్రమించిన రాజస్తాన్ రాయల్స్

రాజస్తాన్ రాయల్స్

IPL 2025  మ్యాచ్ నెం.62 రాజస్తాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ సీజన్‌లో చివరి మ్యాచ్ ఆడిన రాజస్తాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో 17 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మంచి బౌలింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఎక్కువ పరుగులు చేయకుండా రాజస్తాన్ బౌలర్ ఆకాశ్ మాధ్వాల్ అడ్డుకున్నాడు. గొప్ప ప్రదర్శన కనబరిచి 3 వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

రాజస్తాన్ రాయల్స్

CSK ను కట్టడి చేసిన రాజస్తాన్ రాయల్స్

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్నింగ్స్ 2వ ఓవర్‌లోనే కాన్వే మరియు ఉర్విల్ పటేల్ వికెట్లు కోల్పోయింది. యుధ్వీర్ సింగ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు సాధించి చెన్నై సూపర్ కింగ్స్‌కు దెబ్బ తీశాడు. ఆ తరువాత ఆయుష్ మాథ్రే 43 పరుగులు ధూకుదుగా ఆడి 6వ ఓవర్లో ఔటవ్వేసరికి చెన్నై జట్టు 68-3 పరుగులు సాధించింది. ఆ తరువాత అశ్విన్ మరియు జడేజా తొందరగా వెనుదిరిగిన శివమ్ దూబే మరియు బ్రెవిస్ కలిసి జట్టును ముందుకు నడిపించి 59 పరుగుల భాగస్వామ్యం నిలకోల్పారు. ఇన్నింగ్స్ చివరలో రాజస్తాన్ రాయల్స్ చెన్నై జట్టు ఎక్కువ పరుగులు చేయకుండా 188 పరుగులకు కట్టడి చేసింది. రాజస్తాన్ బౌలింగ్‌లో యుధ్వీర్ సింగ్ మరియు ఆకాశ్ మాధ్వాల్ చెరో 3 వికెట్లు సాధించగా, తుషార్ దేశ్‌పాండే మరియు హసరంగ తలో వికెట్ దక్కించుకున్నారు.

సులభంగా విజయం సాధించిన రాజస్తాన్ రాయల్స్

రాజస్తాన్ రాయల్స్

189 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్ జట్టు ఓపెనర్లు జైస్వాల్ మరియు సూర్యవంశీ మంచి ప్రదర్శన కనబరిచారు. ఇన్నింగ్స్ మొదట్లో జైస్వాల్ 36 పరుగులు సాధించి వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్తాన్ జట్టు 56-1 పరుగులు సాధించింది. ఆ తరువాత సూర్యవంశీ మరియు శాంసన్ కలిసి 98 పరుగులు సాధించారు. వీరిద్దరు నిష్క్రమించే సమయానికి విజయానికి అవసరమైన రన్‌రేట్ బాగా తగ్గిపోయింది. ఇన్నింగ్స్ చివరలో హిట్టింగ్‌తో చెలరేగిపోయిన జురేల్ 12 బంతుల్లో 31 పరుగులు సాధించి రాజస్తాన్ జట్టుకు విజయాన్ని అందించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్‌లో అశ్విన్ 2 వికెట్లు సాధించగా కంబోజ్ మరియు నూర్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ప్రయాణం 4 విజయాలు, 10 ఓటములతో ముగిసింది.

for more IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *