Headlines

చివరి లీగ్ మ్యాచ్‌లో Delhi Capitals ధమాకా

Delhi Capitals

IPL 2025 మ్యాచ్ నెం. 66లో Delhi Capitals మరియు Punjab Kings జట్లు మధ్య పోటీ జరిగింది. అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన Delhi Capitals జట్టు 6 వికెట్ల తేడాతో 3 బంతులు మిగిలుండగానే విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్ పొజిషన్‌లో నిలిచే అవకాశం Punjab Kings పోగొట్టుకుంది. సమీర్ రిజ్వీ 25 బంతుల్లో 58 పరుగులు చేసి Man of the Match అవార్డు అందుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన Delhi Capitals జట్టు కెప్టెన్ డుప్లెసిస్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

Delhi Capitals

పట్టు వదలకుండా పోరాడిన Punjab Kings

ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 2వ ఓవర్‌లోనే Punjab Kings జట్టు ప్రియాంశ్ ఆర్య వికెట్ కోల్పోయింది. ఆ తరువాత వేగంగా పరుగులు చేసిన జోష్ ఇంగ్లిస్ 12 బంతుల్లో 32 పరుగులు చేసి 6వ ఓవర్‌లో వికెట్ కోల్పోయాడు. పవర్‌ప్లే ముగిసేసరికి Punjab Kings జట్టు 60-2 పరుగులు చేసింది. తరువాత శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుకు నడిపించాడు. 53 పరుగులు చేసిన అయ్యర్ టాప్ స్కోరర్‌గా నిలవగా, ఇన్నింగ్స్ చివర్లో హిట్టింగ్‌తో చెలరేగిపోయిన మార్కస్ స్టోయినిస్ 16 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టు స్కోరును 206 పరుగులకు చేర్చాడు. Delhi Capitals బౌలింగ్‌లో ముస్తాఫిజుర్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ మరియు విప్రాజ్ నిగమ్ చెరో 2 వికెట్లు తీశారు. ముఖేష్ కుమార్ 1 వికెట్ సాధించాడు.

విజయంతో టోర్నీ ముగించిన Delhi Capitals

207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన Delhi జట్టుకు ఓపెనర్లు డుప్లెసిస్ మరియు KL రాహుల్ మంచి ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో KL రాహుల్ 35 పరుగులు చేసి అవుటయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి Delhi జట్టు 61-1 పరుగులు చేసింది. ఆ తరువాత 23 పరుగులు చేసిన డుప్లెసిస్ అవుటవగా, కరుణ్ నాయర్ మరియు సమీర్ రిజ్వీ కలిసి 61 పరుగుల భాగస్వామ్యం నిలబెట్టారు.

Delhi Capitals

కరుణ్ నాయర్ 44 పరుగులు, సెదీఉల్లా 22 పరుగులు, స్టబ్బ్స్ 18 పరుగులు చేయగా, 58 పరుగులతో సమీర్ రిజ్వీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. Punjab Kings బౌలింగ్‌లో హర్ప్రీత్ 2 వికెట్లు తీయగా, జాన్సెన్ మరియు ప్రవీణ్ దూబే తలో వికెట్ తీశారు.

for more IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *