ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ పై విజయం సాధించి ఛాంపియన్ గా అవతరించింది. అన్ని విభాగాల్లో సమష్టిగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా గెలుపొందింది. ఈ విజయంతో భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ విజేత దేశాలు

భారత్ – 2002, 2013, 2025
పాకిస్తాన్ – 2017
శ్రీలంక – 2002 (భారత్తో సంయుక్త విజేత)
ఆస్ట్రేలియా – 2006
వెస్టిండీస్ – 2004
న్యూజిలాండ్ – 2000
దక్షిణాఫ్రికా – 1998

ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రధాన టోర్నమెంట్లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి. ఈ టోర్నమెంట్ తొలిసారిగా 1998లో బంగ్లాదేశ్లో నిర్వహించబడింది. ప్రపంచకప్ తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన వన్డే టోర్నమెంట్ గా క్రికెట్ అభిమానులు ఛాంపియన్స్ ట్రోఫీని భావిస్తారు. ఇది 50 ఓవర్ల అంతర్జాతీయ వన్డే క్రికెట్ టోర్నమెంట్, ఇందులో 8 దేశాలు పాల్గొంటాయి.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలను పాకిస్తాన్ చేపట్టింది. అయితే, భద్రతా కారణాల వల్ల భారత్ పాకిస్తాన్ కు వెళ్లకపోవడంతో, భారత జట్టు మ్యాచ్లను దుబాయ్ లో నిర్వహించారు. సామర్థ్యం కలిగిన జట్ల మధ్య జరిగిన పోటీ అనంతరం న్యూజిలాండ్, భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు అర్హత సాధించాయి. ఇక, ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫైనల్ కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది.

గత 25 ఏళ్ల క్రితం, 2000 సంవత్సరంలో భారత్ మరియు న్యూజిలాండ్ తలపడ్డాయి. ఆ సమయంలో న్యూజిలాండ్ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ ను ఓడించి టైటిల్ ను సొంతం చేసుకుంది.

న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అయితే, 7.5వ ఓవర్లో 57 పరుగుల వద్ద భారత జట్టుకు తొలి వికెట్ లభించింది. వరుణ్ చక్రవర్తి 15 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్న ఓపెనర్ విల్ యంగ్ ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశారు. అనంతరం బౌలింగ్ కు వచ్చిన కుల్దీప్ యాదవ్, తన తొలి బంతికే రచిన్ రవీంద్ర (37 పరుగులు) ను అవుట్ చేశారు. 12వ ఓవర్లో కుల్దీప్ యాదవ్, కెప్టెన్ విలియమ్సన్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను అందుకోవడంతో న్యూజిలాండ్ జట్టుకు మరో కీలక వికెట్ లభించింది. ఆ తరువాత డారెల్ మిచెల్ మరో బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిప్‌తో కలిసి 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరి ఓవర్లలో బ్రేస్వెల్ 40 బంతుల్లో 53 పరుగులు చేయడంతో, న్యూజిలాండ్ జట్టు మొత్తం 251 పరుగులకి చేరుకుంది.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పటిష్టమైన ఆరంభాన్ని అందించడంతో, భారత్ మొదటి వికెట్ కోల్పోయే సమయానికి 105 పరుగుల భాగస్వామ్యాన్ని అందుకుంది. అయితే, అనంతరం స్వల్ప వ్యవధిలోనే శుభ్మన్ గిల్ 31 పరుగులు, విరాట్ కోహ్లీ 1 పరుగుతో వెనుదిరగడంతో, భారత జట్టు రెండవ వికెట్ కోల్పోయింది. తర్వాత రోహిత్ శర్మ 76 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర బౌలింగ్లో స్టంప్ అవ్వడంతో భారత్ కొంత ఒత్తిడిని ఎదుర్కొంది. అనంతరం అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ మధ్య 61 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. చివరి దశలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ జట్టుకు విజయాన్ని అందించారు.

for more cricket updates check sports

2 thoughts on “ఛాంపియన్స్ ట్రోఫీ 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *