Headlines

టేబుల్ టాపర్స్‌కి లక్నో సూపర్ జెయింట్స్ షాక్

లక్నో సూపర్ జెయింట్స్

IPL 2025 మ్యాచ్ నం.64లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడ్డాయి. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన లక్నో జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో సెంచరీ సాధించిన తొలి విదేశీ బ్యాట్స్‌మన్‌గా మిచెల్ మార్ష్ నిలిచాడు. హిట్టింగ్‌తో చెలరేగిపోయిన మార్ష్ 64 బంతుల్లో 117 పరుగులు చేసి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఎకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్

హిట్టింగ్‌తో చెలరేగిపోయిన లక్నో సూపర్ జెయింట్స్

ఈ సీజన్‌లో ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన లక్నో జట్టు అద్భుతమైన ఆటతీరు‌తో అలరించింది. ముఖ్యంగా మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పూరన్ గుజరాత్ టైటన్స్ జట్టును దెబ్బ తీశారు. లక్నో జట్టు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు సాధించింది. మార్క్రమ్ మరియు మార్ష్ 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత 36 పరుగుల వద్ద మార్క్రమ్ వెనుదిరిగిన నికోలస్ పూరన్‌తో కలిసి మార్ష్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరి జోడీ కలిసి 52 బంతుల్లోనే 121 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో పంత్ వేగంగా ఆడగా లక్నో జట్టు 235 పరుగులు చేరుకుంది. గుజరాత్ టైటన్స్ జట్టు బౌలింగ్‌లో అర్షద్ ఖాన్ మరియు సాయి కిషోర్ తలో వికెట్ సాధించగా, మిగతా బౌలర్లు నిరాశ పరిచారు.

లక్నో సూపర్ జెయింట్స్

ఇన్నింగ్స్‌ చివర్లో గుజరాత్ విఫలం

ఈ సీజన్‌లో గుజరాత్ టైటన్స్ జట్టు బ్యాటింగ్ మొత్తం టాప్ ఆర్డర్ మీద ఆధారపడింది. ఈ మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించకపోవడంతో గుజరాత్ టైటన్స్ జట్టు విజయం సాధించలేకపోయింది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ జట్టు పవర్‌ప్లేలో సాయి సుధర్షన్ 21 పరుగులకు వికెట్ కోల్పోయి 67-1 పరుగులు చేసింది. ఆ తరువాత గిల్ 35 పరుగులు, బట్లర్ 33 పరుగులు మరియు రదర్‌ఫోర్డ్ 38 పరుగులు సాధించగా, 57 పరుగులు చేసి షారుఖ్ ఖాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బౌలింగ్‌లో విలియం 3 వికెట్లు, అవేశ్ మరియు బడోని తలో 2 వికెట్లు సాధించగా, ఆకాష్ మరియు షాబాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

for more IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *