IPL 2025లో శనివారం రోజున డబుల్ హెడ్డర్‌లో భాగంగా మధ్యాహ్నం నిర్వహించిన మ్యాచ్‌లో ఢిల్లీ కాపిటల్స్ మరియు గుజరాత్ టైటన్స్ తలపడిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఇరు జట్లు విజయం కోసం పోటీపడగా, గుజరాత్ టైటన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో 4 బంతులు మిగిలినవేళ విజయాన్ని అందుకుంది. టార్గెట్ చేధనలో అద్భుతంగా ఆడిన గుజరాత్ ఆటగాడు జాస్ బట్లర్ 97 పరుగులతో మెరిసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

మంచి స్కోరు సాధించిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు:
ఢిల్లీ కాపిటల్స్ జట్టు పవర్‌ప్లేలో వికెట్లు కోల్పోయినా అవసరమైన రన్‌రేట్‌తో ఆట కొనసాగించింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ మరియు కేఎల్ రాహుల్ వేగంగా పరుగులు సాధించారు. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో పోరెల్ క్యాచ్ అవుట్ అయ్యాడుగా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రాహుల్ LBWగా వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ జట్టు స్కోరు 73/2గా ఉంది. అనంతరం బ్యాటర్లు కరుణ్ నాయర్ (31), అక్షర్ పటేల్ (39), స్టబ్స్ (31), అశుతోష్ శర్మ (37) చక్కటి ప్రదర్శనతో జట్టును ముందుకు నడిపారు. ఫలితంగా ఢిల్లీ జట్టు 203 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. గుజరాత్ బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు సాధించగా, సిరాజ్, అర్షద్, ఇషాంత్ మరియు సాయి కిషోర్ తలో వికెట్ తీసుకున్నారు.
తడబాటు లేకుండా గుజరాత్ టైటన్స్ విజయం:

204 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లో కెప్టెన్ గిల్ రనౌట్ కావడంతో జట్టు ఒత్తిడిలో పడింది. కానీ జాస్ బట్లర్‌తో కలసి సాయి సుదర్శన్ 60 పరుగుల భాగస్వామ్యంతో జట్టును నిలబెట్టాడు. అనంతరం కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సుదర్శన్ అవుట్ అయినా, బట్లర్‌తో కలసి రథర్‌ఫోర్డ్ జట్టును విజయతీరాలకు చేర్చారు. బ్యాటింగ్‌లో అద్భుతంగా ఆడిన బట్లర్ 97 పరుగులతో గుజరాత్ టైటన్స్‌ను గెలుపు దిశగా నడిపించాడు. ఢిల్లీ బౌలింగ్‌లో ముకేశ్ కుమార్ మరియు కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
for more IPL updates visit Sports