IPL 2025 మ్యాచ్ నం. 63లో ముంబయి ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటి పడ్డాయి. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. ముంబయి ఇండియన్స్ జట్టు 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ముంబయి ఇండియన్స్ జట్టు సెమీఫైనల్‌కి అడుగుపెట్టింది. బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ 73 పరుగులు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ముంబయి ఇండియన్స్ జట్టు
మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు చివరి దాకా తడబడి ఇన్నింగ్స్ చివర్లో చెలరేగిపోయింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో రోహిత్ శర్మ 5 పరుగులకు ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అవగా, 6వ ఓవర్‌లో ముకేష్ కుమార్ బౌలింగ్‌లో విల్ జాక్స్ 21 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి ముంబయి జట్టు 54-2 పరుగులు సాధించింది. ఆ తర్వాత రికెల్టన్ 25 పరుగులకు అవుట్ కాగా, సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ కలిసి 55 పరుగులు సాధించారు. ఆ తరువాత వరుసగా వికెట్లు కోల్పోయిన ముంబయి జట్టు ఇన్నింగ్స్ చివరి 2 ఓవర్లలో 48 పరుగులు సాధించి జట్టు స్కోరును 180 పరుగులకు చేర్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్‌లో ముకేష్ కుమార్ 2 వికెట్లు సాధించగా, ముస్తాఫిజుర్, చమీరా మరియు కుల్దీప్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
చేసింగ్‌లో ఢిల్లీ ఢమాల్

181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా ప్రయాణించలేదు. వరుసగా వికెట్లు కోల్పోయి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమితో మూల్యం చెల్లించుకుంది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సమీర్ రిజ్వీ 39 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు అందరూ నిరాశ పరిచారు. పవర్‌ప్లే ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయింది. సమీర్ రిజ్వీ మరియు అశుతోష్ శర్మ 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఢిల్లీ జట్టు 121 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ముంబయి ఇండియన్స్ బౌలింగ్‌లో శాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా తలో 3 వికెట్లు సాధించగా, చహర్, బౌల్ట్, జాక్స్ మరియు కర్ణ్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.
for more IPL updates visit Sports