IPL 2025 Match no 40 లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 13 బంతులు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఢిల్లీ జట్టు సునాయాసంగా విజయాన్ని కైవసం చేసుకొని పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతుంది. బౌలింగ్ లో మంచి ప్రదర్శన కనబర్చిన 4 వికెట్లు దక్కించుకున్న ముకేష్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు. ఏకానా స్టేడియం వేదికలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఆరంభం అదిరిన లక్నో సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరు
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మార్క్రం మరియు మిచెల్ మార్ష్ పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా 51 పరుగులు సాధించారు. 87 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత చమీరా బౌలింగ్ లో 52 పరుగుల వద్ద మార్క్రం క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్ 45 పరుగులు మరియు బడోని 36 పరుగులు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ స్కోరు సాధించడంలో విఫలమయ్యారు. అద్భుతమైన బౌలింగ్ తో ఢిల్లీ జట్టు 159 పరుగుల స్కోరుకే లక్నో సూపర్ జెయింట్స్ ను కట్టడి చేసింది. ఢిల్లీ బౌలింగ్ లో ముకేష్ కుమార్ 4 వికెట్లు, స్టార్క్ మరియు చమీరా తలో వికెట్ దక్కించుకున్నారు.
సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్

160 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు గొప్ప విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో పట్టుదలగా ఆడి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో పోరెల్ 51 పరుగులు, KL రాహుల్ 57 పరుగులు మరియు అక్షర్ పటేల్ 34 పరుగులు సాధించారు. ఈ సీజన్ లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న ఢిల్లీ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ లో మార్క్రం 2 వికెట్లు సాధించగా మిగతా బౌలర్లు రాణించలేకపోయారు.
for more IPL updates visit Sports