IPL 2025లో మ్యాచ్ సంఖ్య 60లో గుజరాత్ టైటాన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడినాయి. లీగ్‌లో ముందుకు సాగాలంటే తప్పకుండా గెలవాల్సిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ జట్టును వికెట్ కోల్పోకుండా 200 పరుగుల లక్ష్యాన్ని చేధించి అద్భుత విజయాన్ని సాధించింది. శతకంతో ఆకట్టుకున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుధర్శన్ 108 పరుగులు సాధించి “మాన్ ఆఫ్ ది మ్యాచ్”గా నిలిచాడు. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ పోటీలో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
శతకంతో రాణించిన కేఎల్ రాహుల్
ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు నాలుగో ఓవర్లో డుప్లెసిస్ వికెట్ కోల్పోయింది. అనంతరం కేఎల్ రాహుల్ మరియు పోరెల్ జట్టును నిలబెట్టారు. వీరిద్దరూ కలసి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

తర్వాత అక్షర్ పటేల్ 25 పరుగులు, స్టబ్బ్స్ 21 పరుగులు చేసి రాహుల్‌కు తోడుగా నిలిచారు. రాహుల్ 60 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఈ సహకారంతో ఢిల్లీ జట్టు 199 పరుగులు సాధించింది. గుజరాత్ బౌలింగ్‌లో అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ తలో వికెట్లు తీశారు.
ఢిల్లీని చిత్తుచేసిన గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్
200 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన గుజరాత్ ఓపెనర్లు సాయి సుధర్శన్ మరియు శుభ్‌మన్ గిల్ చెలరేగి ఆడి ఢిల్లీ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇద్దరూ వికెట్ కోల్పోకుండా గెలుపు సాధించారు. సాయి సుధర్శన్ 108 పరుగులు చేయగా, గిల్ 93 పరుగులు చేశాడు.

ఈ విజయంతో సాయి సుధర్శన్ ఆరెంజ్ క్యాప్ పోటీలో ముందంజలో ఉన్నాడు. గుజరాత్ జట్టు పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది, ఆర్సీబీ మరియు పంజాబ్ జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
for more IPL updates visit Sports