IPL 2025 మ్యాచ్ No.44 కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. మ్యాచ్ వల్ల అంతరాయం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెరో పాయింట్ ప్రకటించారు. లీగ్‌లో ముందుకెళ్లే దశలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ముఖ్యం కాగా, చెరో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితంతో పంజాబ్ కింగ్స్ జట్టు 11 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

చెలరేగిన పంజాబ్ కింగ్స్:
పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభుసిమ్రన్ సింగ్ మరియు ప్రియాంశ్ ఆర్య పంజాబ్ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లే వికెట్ కోల్పోకుండా ఈ జోడీ 56 పరుగులు సాధించింది. ఆ తరువాత దూకుడు పెంచిన ప్రియాంశ్ ఆర్య 27 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో రస్సెల్ బౌలింగ్‌లో ప్రియాంశ్ ఆర్య (69 పరుగులు) క్యాచ్ అవుట్ అయ్యాడు. అప్పటివరకు ప్రియాంశ్ ఆర్యకు సహకారం అందించిన ప్రభుసిమ్రన్ సింగ్ చెలరేగి ఆడి 49 బంతుల్లో 83 పరుగులు సాధించి వైభవ్ అరోరా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు.

ఆ తరువాత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మంచి బౌలింగ్ వేసి డెత్ ఓవర్లలో పంజాబ్ జట్టు పరుగులు సాధించకుండా కట్టడి చేసింది. మాక్స్‌వెల్ 7 పరుగులు మరియు జాన్సన్ 3 పరుగులు సాధించి అవుట్ కాగా, శ్రేయస్ అయ్యర్ మరియు ఇంగ్లిస్ చివర్లో పరుగులు సాధించి జట్టు స్కోరును 201 పరుగులకు చేర్చారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బౌలింగ్‌లో వైభవ్ అరోరా 2 వికెట్లు సాధించగా, రస్సెల్ మరియు వరుణ్ చక్రవర్తి తలో వికెట్ దక్కించుకున్నారు.
ఆ తరువాత 202 పరుగులతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఒక్క ఓవర్ మాత్రమే ఆడగలిగింది.
for more IPL updates visit Sports