IPL 2025 మ్యాచ్ నం 16 లక్నో సూపర్ జెయింట్స్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య జరిగింది. ఇరు జట్లు గొప్ప ప్రదర్శన కనబరిచిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది. అద్భుతంగా బౌలింగ్ చేసిన లక్నో జట్టు బౌలర్ దిగ్వేష్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఏకానా స్టేడియం వేదికగా చోటు చేసుకున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు.

మంచి స్కోర్ సాధించిన లక్నో సూపర్ జెయింట్స్
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్స్ మిచెల్ మార్ష్ మరియు ఐడెన్ మార్క్రమ్ బాగా రాణించారు. హిట్టింగ్ చేస్తూ పవర్‌ప్లేలో సత్తా ఛాటిన మిచెల్ మార్ష్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లే ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 69 పరుగులు సాధించింది. ఆ వెంటనే 60 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్ష్ క్యాచ్ అవుట్ అవగా, నికోలస్ పూరన్ మరియు పంత్ వికెట్లను లక్నో జట్టు తొందరగానే కోల్పోయింది. ఆ తరువాత ఆయుష్ బడోనీ మరియు మార్క్రమ్ కలిసి 51 పరుగుల భాగస్వామ్యం సాధించగా బడోనీ క్యాచ్ అవుట్ అవగా, అబ్దుల్ సమద్ మరియు మిల్లర్ వికెట్లను స్వల్ప వ్యవధిలో కోల్పోయారు. మిల్లర్ మరియు బడోనీ హిట్టింగ్ కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 203 పరుగులు చేయగలిగింది. ముంబయి ఇండియన్స్ బౌలింగ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 5 వికెట్లు సాధించగా బౌల్ట్, అశ్వనీ మరియు విఘ్నేష్ తలో వికెట్ దక్కించుకున్నారు.
విజయాన్ని చేరుకోలేక చతికిలపడ్డ ముంబయి

204 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ జట్టు ఓపెనర్స్ వికెట్లను తొందరగా చేజార్చుకుంది. 2 మరియు 3వ ఓవర్లలో విల్ జాక్స్, రికెల్టన్ క్యాచ్ అవుట్ అయ్యారు. ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి నమన్ ధీర్ 69 పరుగుల భాగస్వామ్యం సాధించాడు, దిగ్వేశ్ బౌలింగ్‌లో నమన్ ధీర్ బౌల్డ్ అవగా, ఇంపాక్ట్ ప్లేయర్‌గా తిలక్ వర్మ క్రీజ్‌లోకి వచ్చాడు. అద్భుతంగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ 67 పరుగులు సాధించగా, తిలక్ వర్మ పరుగులు సాధించడంలో బాగా ఇబ్బంది పడుతూ రిటైర్ అవుట్‌గా వెనుదిరిగాడు. సాధించాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోవడం వల్ల ముంబయి ఇండియన్స్ వేగంగా పరుగులు సాధించలేక చతికిలపడింది. బౌలింగ్‌లో గొప్ప ప్రదర్శన కనబర్చిన లక్నో జట్టు బౌలర్లు విజయాన్ని సాధించారు. శార్దూల్, ఆకాష్‌దీప్, అవేశ్ మరియు దిగ్వేశ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
For more IPL updates visit Sports