ఐపీఎల్ 2025 మ్యాచ్ నెం. 38లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబయి ఇండియన్స్ తలపడ్డాయి. బ్యాటింగ్‌లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన ముంబయి ఇండియన్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌పై 9 వికెట్ల తేడాతో 26 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన రోహిత్ శర్మ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. వాంఖడే స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

తక్కువ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్:
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరంభంలో రవీంద్ర 5 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసే సరికి 48-1 పరుగులు సాధించింది. చెన్నై జట్టు యువ బ్యాట్స్‌మెన్ రషీద్ మరియు ఆయుష్ మాథ్రే కలిసి 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత చహర్ బౌలింగ్‌లో ఆయుష్ క్యాచ్ అవుట్ కాగా, శాంట్నర్ బౌలింగ్‌లో రషీద్ స్టంప్ అవుట్ అయ్యాడు. అనంతరం శివమ్ దూబే మరియు జడేజా కలిసి 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శివమ్ దూబే బుమ్రా బౌలింగ్‌లో అవుట్ కాగా, జడేజా చివరి దాకా పోరాడి చెన్నై జట్టు స్కోరును 176 పరుగులకు చేర్చాడు. ముంబయి బౌలింగ్‌లో బుమ్రా రెండు వికెట్లు సాధించగా, చహర్, అశ్వనీ మరియు శాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
పూర్తి ఆధిపత్యంతో ముంబయి ఇండియన్స్ విజయం:

177 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబయి ఇండియన్స్ జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. పవర్‌ప్లే నుంచే పూర్తి ఆధిపత్యం సాధించి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకుంది. ముంబయి జట్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 76 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులు మరియు రికెల్టన్ 24 పరుగులు చేసి చెన్నై జట్టును చిత్తుగా ఓడించారు. చెన్నై బౌలింగ్‌లో రవీంద్ర జడేజా ఒక్క వికెట్ మాత్రమే తీసుకోగలిగారు, మిగిలిన బౌలర్లు నిరాశ పరిచారు.
for more IPL updates visit Sports