రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దశాబ్దపు కల, ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో విజయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

IPL 2025 మ్యాచు నెం.20 ముంబయి ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చోటు చేసుకుంది. అద్భుతంగా సాగిన ఈ మ్యాచ్ IPL ప్రేక్షకులకు అమితమైన ఆనందాన్ని కలిగించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు విజయం కోసం పోటీ పడిన ఈ పోరులో గొప్ప బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ “మాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. ముంబయి వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

అద్భుతంగా ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే బెంగళూరు జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్‌ను ట్రెంట్ బౌల్ట్ కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత పడిక్కల్‌తో కలసి విరాట్ కోహ్లీ پا워ప్లే ముగిసే సమయానికి 73/1 పరుగులు సాధించారు. విరాట్ కోహ్లీ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 91 పరుగుల భాగస్వామ్యం తర్వాత, విజ్ఞేష్ బౌలింగ్‌లో 37 పరుగులు చేసిన పడిక్కల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం రజత్ పాటిదార్ మరియు విరాట్ కోహ్లీ స్కోర్‌బోర్డ్‌ను ముందుకు నడిపారు.

ఆ తరువాత మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్‌లో విరాట్ కోహ్లీ మరియు లివింగ్‌స్టోన్ వికెట్లను తీశాడు. ఆ తర్వాత జితేష్ మరియు పాటిదార్ కలిసి వేగంగా పరుగులు సాధించి ముంబయి ఇండియన్స్‌కు 222 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ముంబయి బౌలింగ్‌లో హార్దిక్ మరియు బౌల్ట్ చెరో రెండు వికెట్లు, విజ్ఞేష్ ఒక వికెట్ తీసుకున్నారు.

ఉత్కంఠ పోరులో RCB పైచేయి:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ జట్టు నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. پاవర్‌ప్లే ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 54/2 వద్ద నిలిచింది. 12 ఓవర్లలో ముంబయి జట్టు స్కోర్ 99/4గా ఉండగా, ముంబయి జట్టులో అసలైన ప్రతిఘటన ప్రారంభమైంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరియు తిలక్ వర్మ కలిసి 34 బంతుల్లో 89 పరుగుల భాగస్వామ్యం తో మ్యాచ్‌ను ముంబయి వశంలోకి తీసుకువచ్చారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

అయితే వెంటనే తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యా అవుటవ్వడంతో ముంబయి జట్టు పరాజయం పొందింది. ముంబయి జట్టులో 56 పరుగులతో తిలక్ వర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలింగ్‌లో క్రునాల్ పాండ్యా 4 వికెట్లు తీయగా, యష్ దయాల్ మరియు హేజిల్వుడ్ చెరో 2 వికెట్లు, భువనేశ్వర్ ఒక వికెట్ తీసుకున్నారు.

for more IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *