
ఎవరినైనా 14 ఏళ్లప్పుడు జీవితంలో నువ్వు ఏమి సాధిస్తావు? అని అడిగితే వాళ్లు సాధించాలనుకొనే విషయాలన్నీ చెప్పినప్పుడూ అనుమానించకూడదని ఈ రోజు వైభవ్ సూర్యవంశీ రుజువు చేశాడు. 14 ఏళ్ల వయసు కుర్రాడు ఐపీఎల్‌లో సెంచరీ సాధిస్తాడని చెబితే ఎవరైనా నవ్వుకునేవాళ్లేమో, కానీ ఇక మీదట అలాంటి అనుమానాలకు తావులేకుండా ఆ అసాధ్యమైన పనిని సాధించిన ఈ కుర్రాడు ఐపీఎల్‌లో చాలా రికార్డులు భద్దలు కొట్టాడు. ఈ రోజు ఐపీఎల్‌లో చోటుచేసుకున్న పరిణామం భారత క్రికెట్ ప్రేక్షకులు ఇప్పటిదాకా చూడని ఒక సంఘటనను, చరిత్రలో మిగిలిపోయే కొన్ని అంశాలను ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.47 లో చవిచూసారు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ 35 బంతుల్లో పూర్తి చేసి, అత్యల్ప వయసులో సెంచరీ మరియు ఒకే సెంచరీలో ఎక్కువ బౌండరీలు కొట్టి రికార్డు సాధించాడు.
బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
మంచి స్కోరు సాధించిన గుజరాత్ టైటాన్స్:

గుజరాత్ టైటాన్స్ జట్టు ఓపెనర్లు సాయి సుధర్షన్ మరియు శుభ్మాన్ గిల్ మంచి ఆరంభాన్ని అందుకున్నారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 53 పరుగులు సాధించారు. 29 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక, వీరిద్దరి జోడీ 93 పరుగులు సాధించి థీక్షణ బౌలింగ్‌లో సాయి సుధర్షన్ క్యాచ్ అవుట్ అయ్యాక బట్లర్ మరియు శుభ్మాన్ గిల్ కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి 74 పరుగుల భాగస్వామ్యం సాధించిన తరువాత గిల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివర్లో వేగంగా పరుగులు సాధించిన బట్లర్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి జట్టు స్కోరును 209 పరుగులకు చేర్చారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్‌లో థీక్షణ 2 వికెట్లు సాధించగా, ఆర్చర్ మరియు సందీప్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.
సూర్యవంశీ సూపర్ షో:
210 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ కన్ను చెదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. చెలరేగి ఆడిన రాజస్థాన్ ఓపెనర్లు పవర్‌ప్లేలో వికెట్ కోల్పోకుండా 87 పరుగులు సాధించారు. ఆ తరువాత కూడా గొప్ప ప్రదర్శన కనబర్చిన రఘువంశీ 35 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. 166 పరుగుల భాగస్వామ్యం సాధించిన తరువాత ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో సూర్యవంశీ బౌల్డ్ అయ్యాక, రియాన్ పరాగ్ తో కలిసి జైశ్వాల్ రాజస్థాన్ జట్టుకు విజయం అందించారు. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌లో ప్రసిద్ కృష్ణ మరియు రషిద్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
for more IPL updates visit Sports