IPL 2025 మ్యాచ్ నం. 52 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. సూపర్ థ్రిల్లర్ మ్యాచ్‌లో చివరి బంతికి ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. ఇరు జట్లు విజయం దక్కించుకోవడానికి అద్భుతమైన కృషిని కనబర్చాయి. ఈ మ్యాచ్‌లో గెలుపుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుజట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. కళ్ళు చెదిరే హిట్టింగ్‌తో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన రొమారియో షెపర్డ్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఇది రెండవ వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఆర్సీబీ జట్టు ఓపెనర్లు కోహ్లీ మరియు బెథెల్ మంచి ప్రదర్శన కనబరిచారు. పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు సాధించారు. 28 బంతుల్లో బెథెల్ హాఫ్ సెంచరీ సాధించి పథిరానా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత కోహ్లీ 29 బంతుల్లో 50 పరుగులు చేరుకున్నాడు. 62 పరుగుల వద్ద సామ్ కరన్ బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్ అవుట్ అయిన తర్వాత చెన్నై జట్టు మంచి ప్రదర్శన కనబరిచి ఆర్సీబీ జట్టును కట్టడి చేసింది. ఇన్నింగ్స్ చివర్లో బ్రూటల్ హిట్టింగ్‌తో చెలరేగిపోయిన షెపర్డ్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి జట్టు స్కోరును 213 పరుగులకు చేర్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్‌లో పథిరానా 3 వికెట్లు సాధించగా, నూర్ అహ్మద్ మరియు సామ్ కరన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
చివరి దాకా పోరాడిన చెన్నై సూపర్ కింగ్స్

214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పవర్‌ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆయుష్ మాథ్రే గొప్ప ప్రదర్శన కనబరిచి చెన్నై జట్టులో 94 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆయుష్ మరియు జడేజా 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 45 బంతుల్లో 77 పరుగులు చేసి జడేజా చివరి దాకా విజయం కోసం పోరాడాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో యశస్వి దయాల్ మంచి ప్రదర్శన కనబరిచి ఆర్సీబీ జట్టుకు విజయాన్ని అందించాడు. ఆర్సీబీ జట్టు బౌలింగ్‌లో ఎన్‌గిడీ 3 వికెట్లు సాధించగా, క్రుణాల్ పాండ్యా మరియు యష్ దయాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
for more IPL updates visit Sports