IPL 2025 రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ సీజన్‌లో బలమైన బ్యాటింగ్ లైన్‌అప్ కలిగిన SRH జట్టు, తమ తొలి మ్యాచ్‌లోనే IPL చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కళ్లుచెదిరే హిట్టింగ్‌తో 20 ఓవర్లలో 286/6 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉప్పల్ స్టేడియంలో తలపడగా, టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

అదిరిపోయే ఆరంభం
మ్యాచ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. SRH ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ మొదటి 3 ఓవర్లలోనే 45 పరుగులు చేశారు. అనంతరం అభిషేక్ శర్మ 24 పరుగుల వ్యక్తిగత స్కోరుతో తీక్షణ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ సీజన్ SRH జట్టులో తొలిసారి ఆడుతున్నఇషాన్ కిషన్, ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. పవర్‌ప్లే ముగిసే సరికి హైదరాబాద్ జట్టు 94/1 స్కోర్ సాధించింది.
Innings 10వ ఓవర్లో బంతిని అందుకున్న తుషార్ దేశ్‌పాండే, SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ (67 పరుగులు) వికెట్ తీసుకున్నాడు. తర్వాత ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి కలిసి 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నితీష్ వికెట్ కోల్పోయేసరికి SRH 14.2 ఓవర్లలో 202/3 వద్ద నిలిచింది. క్లీన్ హిట్టర్ క్లాసెన్ వచ్చిన వెంటనే పరుగులు రాబట్టడం ప్రారంభించగా, ఇషాన్ కిషన్ అతనికి సహకారం అందించాడు.
19వ ఓవర్లో ఇషాన్ కిషన్ తన తొలి IPL శతకాన్ని 45 బంతుల్లోనే పూర్తి చేశాడు. చివర్లో SRH 300 పరుగుల మార్క్ చేరుతుందనిపించినా, తుషార్ దేశ్‌పాండే చివరి ఓవర్లో 2 వికెట్లు తీసి ఆ ఊపును అడ్డుకున్నాడు. ఫలితంగా SRH 286 పరుగులు సాధించింది. రాజస్థాన్ బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండే 3 వికెట్లు, తీక్షణ 2 వికెట్లు, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు.
ఆరంభంలోనే తడబాటు

287 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు, ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సన్‌రైజర్స్ బౌలర్ శిమర్జిత్ సింగ్ 2వ ఓవర్లోనే 2 వికెట్లు తీశాడు. రాజస్థాన్ ఓపెనర్ జైస్వాల్, కెప్టెన్ రియన్ పరాగ్ వెంట వెంటనే క్యాచ్ అవుట్ అయ్యారు.
అనంతరం వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, సంజూ శాంసన్‌తో కలిసి 60 బంతుల్లో 111 పరుగులు చేసి స్కోర్‌బోర్డును ముందుకు నడిపించాడు. కానీ, 14వ, 15వ ఓవర్లలో జురెల్, శాంసన్ వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ జట్టు ఒత్తిడిలో పడింది. చివర్లో శుభమ్ దూబే 11 బంతుల్లో 34 పరుగులు మరియు Hetmyer 23 బంతుల్లో 43 పరుగులు చేసినా, రాజస్థాన్ జట్టు రన్‌రేట్ అదుపులో లేకపోవడంతో మ్యాచ్ చేజారిపోయింది.
సన్‌రైజర్స్ బౌలింగ్‌లో శిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీసుకోగా, షమీ, జాంపా చెరో వికెట్ సాధించారు.
| TEAM | P | W | L | NRR | Points |
| SRH | 1 | 1 | 0 | 2.2 | 2 |
| RCB | 1 | 1 | 0 | 2.1 | 2 |
| KKR | 1 | 0 | 1 | -2.1 | 0 |
| RR | 1 | 0 | 1 | -2.2 | 0 |
for more IPL updates check Sports