ఐపీఎల్ 2025 55వ మ్యాచ్‌లో ఢిల్లీ కాపిటల్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడి రెండు జట్లు పాయింట్ దక్కించుకున్నాయి. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో అంతరాయం కారణంగా హైదరాబాద్ జట్టు టోర్నీ నుండి నిష్క్రమించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శుభారంభం

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెలరేగిపోయిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమ్మిన్స్ అద్భుతమైన అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పవర్‌ప్లే ముగిసే వరకు ఢిల్లీ కాపిటల్స్ జట్టు టాప్ ఆర్డర్ వికెట్లు సాధించాడు. 4 కీలక వికెట్లు కోల్పోయిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు పవర్‌ప్లే ముగిసే సమయానికి 26-4 పరుగు సాధించింది. ఢిల్లీ కాపిటల్స్ జట్టులో స్టబ్బ్స్ మరియు ఆశుతోష్ శర్మ కలిసి 66 పరుగు భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరు 133 పరుగులకు చేరవేశారు. ఢిల్లీ కాపిటల్స్ జట్టు బ్యాటింగ్ లో ఆశుతోష్ 41 పరుగు, స్టబ్బ్స్ 41 పరుగు మరియు విప్రాజ్ 18 పరుగు సాధించగా, మిగితా బ్యాటర్లందరూ నిరాశ పరిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ లో కమ్మిన్స్ 3 వికెట్లు సాధించగా, ఈషాన్ మలింగ, హర్షల్ పటేల్ మరియు ఉనాద్కట్ కూడా వికెట్లు దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్ ఫలితంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుండి నిష్క్రమించింది. ఢిల్లీ కాపిటల్స్ జట్టు మిగితా మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
for more IPL updates visit Sports