ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో 35% గా USA లో recession రావడానికి అవకాశాలు – goldman sachs
ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన అమెరికా Recission వైపు వెలుతోంది. ఇందుకు ప్రధాన కారణాలుగా
- ట్రంప్ టారిఫ్‌ల పెంపు వల్ల వ్యాపారాలు, వినియోగదారుల ఖర్చు తగ్గే ప్రమాదం
- ఆర్థిక వృద్ధి మందగింపు, పెట్టుబడిదారుల ఆందోళన
- వాస్తవ ఆదాయ వృద్ధి 2025లో కేవలం 1.4% మాత్రమే ఉంటుందని అంచనా
recession ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంటుంది
ఆర్ధిక మాంద్యం వలన ఉద్యోగ నష్టాలు (lay offs), వ్యాపార మూసివేతలు, వేతన వృద్ధి మందకొడిగా మారడం ఇతర సమస్యలు, మారుతున్న కార్మిక విభాగం మరియు ఆదాయ అసమానత పెరుగుదల, మాంద్య ప్రభావాన్ని మరింత తీవ్రముగా మార్చే ప్రమాదం ఉంది.

ఆర్ధిక మాంద్యాలు రావడం సహజమే, 2వ ప్రపంచయుద్ధం తర్వాత ఇప్పటివరకు 1౩ ఆర్ధిక మాంద్యాలు వచ్చాయి.కొన్ని మాంద్యాలు విభిన్నమైన కారణాల వల్ల సంభవిస్తాయి. అయితే, ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా వైట్ హౌస్ విధానాల వల్లే వస్తోంది.
2008 ఆర్ధిక మాంద్యం అనేది ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్ అయినా డెరివేటివ్స్ వలన బిల్ క్లిటోన్ పరిపాలనలో వచ్చింది.అయితే అది 10 సంవత్సరాల తర్వాత ప్రభావాన్ని చూపించింది. ఇప్పుడు మాత్రమే వెంటనే దాని ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే US మరియు ప్రపంచ స్టాక్ మార్కెట్స్ నష్టాలను చవి చూస్తున్నాయి.
ఈ మాంద్యం రెండు ప్రధాన ప్రశ్నలను లేవనెత్తుతోంది:
- ప్రభుత్వం మాంద్యాన్ని కలిగించే విధానాలను మార్చుతుందా?
- అవి మార్చినా, మాంద్యాన్ని తగ్గించగలవా?
ట్రంప్ ఇప్పటికే కొన్ని టారిఫ్‌లను వెనక్కి తీసుకున్నాడు, మార్కెట్ మరింత దిగజారితే మళ్ళీ మార్పులు చేసే అవకాశం ఉంది.
for more updates visit News