బంగారం ధరలు భారీగా పడిపోవచ్చని విశ్లేషకుల హెచ్చరిక!
ప్రస్తుతం బంగారం ధరలు చరిత్రలోనే ఎప్పుడూ ఎప్పుడు చూడని విధంగా తార స్థాయికి చేరుకున్నాయి. ఇది పెట్టుబడిదారులకు లాభంగా ఉన్నా, వినియోగదారులపై మరి ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల పై పెను భారంగా మారింది. అయితే తాజాగా అమెరికా కేంద్రంగా ఉన్న Morning star కు చెందిన John Mills, a market strategist త్వరలోనే ధరలు గణనీయంగా పడిపోవచ్చని అంచనావేస్తున్నట్లు CNNnews18 వారి X (ట్విట్టర్) లో పేర్కొన్నారు.
38% తగ్గే అవకాశమున్న Gold ధరలు!
Gold ధరలు రానున్న సంవత్సరాల్లో దాదాపు 38 శాతం వరకు తగ్గవచ్చని అన్నారు. ప్రస్తుత ధర ఔన్స్‌కు $3,100 వద్ద ఉండగా, ఇది $1,820 వరకు పడిపోవచ్చు అని చెప్పారు. అంటే భారత మార్కెట్లో 10 గ్రాముల Gold ధర దాదాపు రూ.90,000 నుండి రూ.55,000 వరకు పడే అవకాశముంది.

ధరలు తగ్గడానికి కారణాలు:
సరఫరాలో పెరుగుదల:
గ్లోబల్ gold ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. 2024లో మైనింగ్ లాభాలు ఔన్స్‌కు $950 వరకు పెరిగాయి. గ్లోబల్ నిల్వలు 9% పెరిగాయి.
తగ్గుతున్న డిమాండ్:
గతేడాది 1,045 టన్నులు gold కొనుగోలు చేసిన కేంద్ర బ్యాంకులు, ఇప్పుడు తక్కువగా కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే ప్రకారం, 71% బ్యాంకులు ఇప్పుడు నిల్వలను తగ్గించేందుకు ప్రణాళిక వేస్తున్నాయి.
గరిష్ట స్థాయికి బంగారం
2024లో బంగారు రంగంలో విలీనాలు, కొనుగోళ్లు 32% పెరిగాయి. ఇది బంగారం రంగం గరిష్ట స్థాయికి చేరిందన్న సంకేతంగా చూస్తున్నారు నిపుణులు.అదే సమయంలో, Gold ఆధారిత ETFల (ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లో పెద్దగా పెట్టుబడులు వచ్చాయి. గతంలో ధరలు పడిపోయే ముందు కూడా ఇదే విధంగా జరిగింది. అందుకే ఇప్పుడు కూడా gold ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు విశ్లేషకులు.
For more updates visit Finance