IPL 2025 మ్యాచ్ నం.11 లో రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఆదివారం జరిగిన డబుల్ హెడ్డర్ మ్యాచ్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. నితీశ్ రాణా మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. బార్సాపారా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
శుభారంభం అందుకున్న రాజస్థాన్ రాయల్స్:

రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి ఓవర్లోనే ఓపెనర్ జైస్వాల్ వికెట్‌ను కోల్పోయింది. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో జైస్వాల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ మరియు నితీశ్ రాణా స్కోర్‌బోర్డ్‌ను ముందుకు నడిపించారు. నితీశ్ రాణా చెలరేగి ఆడి 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 79/1 పరుగులు సాధించింది.
82 పరుగుల భాగస్వామ్యం వద్ద శాంసన్ (20 పరుగులు) నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ కాగా, రాజస్థాన్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ మరియు నితీశ్ రాణా 38 పరుగుల భాగస్వామ్యం జత చేశారు. ఆ తర్వాత జట్టు 124 స్కోర్ వద్ద నితీశ్ రాణా స్టంపౌట్ కావడంతో, ధ్రువ్ జురెల్, హసరంగ మరియు రియాన్ పరాగ్ వికెట్లు వెంటవెంటనే పడిపోయాయి. ఆ తర్వాత హెట్‌మైర్ 19 పరుగులు మినహా ఎవరూ రాణించలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్‌లో పతిరనా, ఖలీల్ మరియు నూర్ అహ్మద్ 2 వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా మరియు అశ్విన్ తలో వికెట్ తీశారు.
చేదనలో తడబడిన చెన్నై:
183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు విజయానికి అంచులదాకా వెళ్లింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఆర్చర్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర క్యాచ్ అవుట్ అయ్యాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి చెన్నై జట్టు 42/1 పరుగులు సాధించింది. చెన్నై బ్యాటింగ్‌లో గైక్వాడ్ మరియు త్రిపాఠి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 63 పరుగులు సాధించి హసరంగ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అవ్వడంతో స్కోరు నిలకడగా సాధించలేకపోయారు. చెన్నై జట్టు సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. ఇన్నింగ్స్ చివర్లో జడేజా మరియు ధోనీ అంకితభావంతో ఆడినా, అవసరమైన పరుగులను చేయలేకపోయారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన రాయల్స్ జట్టు బౌలర్ వనిందు హసరంగ 4 వికెట్లు సాధించగా, ఆర్చర్ మరియు సందీప్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.
For IPL updates visit Sports