IPL 2025 మ్యాచ్ నం 25 లో Kolkata Knight Riders మరియు Chennai Super Kings తలపడ్డాయి. అద్భుతమైన ఆటతో అలరించిన Kolkata Knight Riders జట్టు Chennai Super Kings ను 8 వికెట్ల తేడాతో 59 బంతులు మిగిలుండగానే చిత్తుగా ఓడించింది.
గొప్ప ప్రదర్శనతో చెలరేగిన KKR జట్టు ఆల్‌రౌండర్ Sunil Narine మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చెన్నై చెపాక్ వేదికలో చోటు చేసుకున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన Kolkata Knight Riders జట్టు కెప్టెన్ Ajinkya Rahane ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

Kolkata Knight Riders అద్భుత బౌలింగ్ ప్రదర్శన
ఈ సీజన్‌లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న చెన్నై జట్టును KKR ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. పటిష్టమైన బౌలింగ్ విభాగం కలిసిన KKR జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది.
ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయిన CSK జట్టు కోలుకోలేకపోయింది. Shivam Dube 31 పరుగులు మరియు Vijay Shankar 29 పరుగులు మినహా మిగితా బ్యాటర్లు అందరూ నిరాశ పరిచారు. KKR బౌలింగ్ లో Narine 3 వికెట్లు, Harshit Rana, Varun Chakravarthy తలో 2 వికెట్లు సాధించగా, Vaibhav మరియు Moeen తలో వికెట్ దక్కించుకున్నారు.
8 వికెట్ల తేడాతో 10 ఓవర్లు మిగిలుండగానే

104 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన KKR జట్టు 59 బంతులు మిగిలుండగానే విజయాన్ని సాధించింది. బ్యాటింగ్ తో కూడా అదరగొట్టిన Sunil Narine 44 పరుగులు సాధించగా, Quinton de Kock 23 పరుగులు మరియు Rahane 20 పరుగులు చేశారు.
CSK బౌలింగ్ లో Anshul Kamboj మరియు Noor Ahmed తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో KKR జట్టు నెట్ రన్‌రేట్ బాగా మెరుగుపర్చుకొని పాయింట్స్ టేబుల్ లో 3వ స్థానాన్ని చేరుకోగా, Chennai Super Kings జట్టు 10వ స్థానాన్ని చేరుకుంది.
for more IPL updates visit Sports