ఐపీఎల్ 2025 మ్యాచ్ నెం. 37లో పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 157 పరుగులకు పంజాబ్ జట్టును కట్టడి చేసింది. RCB జట్టు 7 వికెట్ల తేడాతో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో సమిష్టి కృషితో రాణించి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి బెంగళూరు చేరుకుంది. మ్యాచ్ చివరి దాకా నిలిచి రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ 73 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు తలపడిన ఈ జట్లు ఒక్కోసారి విజయం సాధించాయి.

తడబడిన పంజాబ్ కింగ్స్ జట్టు:
మొదటి ఇన్నింగ్స్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. పంజాబ్ ఓపెనర్లు ప్రియంశ్ ఆర్య మరియు ప్రభుసిమ్రన్ సింగ్ వేగంగా పరుగులు సాధించారు. ప్రియంశ్ ఆర్య 22 పరుగుల వద్ద కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అప్పటికే పంజాబ్ జట్టు స్కోరు 42-1గా ఉంది. పవర్‌ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు స్కోరు 62-1. ఆ తర్వాత కృనాల్ బౌలింగ్‌లో 33 పరుగులు చేసిన ప్రభుసిమ్రన్ సింగ్ అవుట్ అయ్యాడు. అప్పటి నుండి పంజాబ్ జట్టు కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. జోష్ ఇంగ్లిస్ 29 పరుగులు, శశాంక్ 31 పరుగులు మరియు జాన్సెన్ 25 పరుగులు చేశారు. పంజాబ్ జట్టు 157 పరుగులు చేసింది. బెంగళూరు జట్టు బౌలింగ్‌లో సుయాష్ శర్మ మరియు కృనాల్ పాండ్యా తలో రెండు వికెట్లు, రోమారియో షెపర్డ్ ఒక వికెట్ తీశారు.

తడబాటు లేకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం:
158 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్రారంభంలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో సాల్ట్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించిన విరాట్ కోహ్లీ పవర్‌ప్లే ముగిసే సమయానికి జట్టు స్కోరును 54-1కి చేర్చారు. వీరిద్దరి భాగస్వామ్యం 103 పరుగులు. ఆ తర్వాత బ్రార్ బౌలింగ్‌లో పడిక్కల్ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ చివరి వరకు నిలిచి రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు విజయాన్ని అందించాడు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్, బ్రార్ మరియు చహల్ తలో వికెట్ సాధించారు. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో 3వ స్థానాన్ని దక్కించుకుంది.
for more IPL updates visit Sports