📈 ఈ రోజు Stock Market లో:
➡ SENSEX – 79,212 (-588 పాయింట్లు)
➡ NIFTY 50 – 24,039 (-207 పాయింట్లు)
➡ BANK NIFTY – 54,641 (-537 పాయింట్లు)

ఈ రోజు ఉదయం SENSEX (+28 పాయింట్లు) మరియు NIFTY 50 (+42 పాయింట్లు) స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఎక్కువ అమ్మకాలు జరగడం మరియు అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు మార్కెట్లో IT రంగానికి చెందిన స్టాక్‌లు బాగా రాణించగా, మీడియా, రియల్టీ, హెల్త్‌కేర్, PSU బ్యాంక్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు చెందిన స్టాక్‌లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు కొన్ని కంపెనీలు Q4 ఫలితాలు ప్రకటించగా, అందులో Reliance Industries ₹3,545 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. Jio ₹7,022 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. Ather కంపెనీ ₹2,981 కోట్లను IPO ద్వారా సేకరించగా, ఏప్రిల్ 28 నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
📌 Stock Market కార్పొరేట్ అప్డేట్స్:
- United Polyfab Gujarat Limited కంపెనీ Face Value Split (Sub-Division) – ₹10/- నుండి ₹1/- Per Shareకి ప్రకటించింది. రికార్డ్ తేదీ: 2-మే-2025, ఎక్స్-డేట్: 2-మే-2025.
- Max India Limited కంపెనీ Rights Issue 19:100 @ Premium ₹140/- ప్రకటించింది. రికార్డ్ తేదీ: 29-ఏప్రిల్-2025, ఎక్స్-డేట్: 29-ఏప్రిల్-2025.
📈 ఈ రోజు Stock Market టాప్ గెయినర్స్ ⬆️
- SBI Life Insurance ⬆️ 5.40%
- Mphasis ⬆️ 2.86%
- Persistent ⬆️ 2.27%
- Coforge Ltd. ⬆️ 1.92%
- Max Financial ⬆️ 1.50%
📉 ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️
- Angel One ⬇️ 6.81%
- SBI Card ⬇️ 6.37%
- ACC ⬇️ 6.20%
- Shriram Finance ⬇️ 5.95%
- Adani Green Energy ⬇️ 5.82%
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.44
🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,714
for more stock market details visit Markets