Headlines

KKR సెమీస్ అవకాశానికి జలక్ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్

IPL 2025 మ్యాచ్ No.57 చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సెమీస్ అవకాశాలను చెన్నై జట్టు క్లిష్టం చేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. చివరి ఓవర వరకు సాగిన ఈ మ్యాచ్‌లో 2 బంతులు మిగిలుండగానే చెన్నై జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న నూర్ అహ్మద్ 4 వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానె ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తడబడిన కోల్‌కతా

ఇన్నింగ్స్ 2వ ఓవర్‌లోనే ఓపెనర్ గుర్బాజ్ వికెట్ కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పవర్‌ప్లే ముగిసే సమయానికి 67-1 పరుగులు సాధించింది. ఆ తరువాత 7వ ఓవర్‌లో 2 వికెట్లు తీసి నూర్ అహ్మద్ KKR కు దెబ్బ తీశాడు. KKR జట్టు బ్యాటింగ్‌లో అజింక్య రహానె 48 పరుగులు, మనీష్ పాండే 36 పరుగులు మరియు రస్సెల్ 38 పరుగులు సాధించి జట్టు స్కోరును 179 పరుగులకు చేర్చారు. చెన్నై జట్టు బౌలింగ్‌లో నూర్ అహ్మద్ 4 వికెట్లు సాధించగా, కంబోజ్ మరియు జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.

చెలరేగిన చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు అదిరిపోయే ఆరంభంతో పాటు వికెట్లు కూడా కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై జట్టు 62-5 పరుగులు సాధించింది. ఆ తర్వాత బ్రెవిస్ మరియు దూబే కలిసి 67 పరుగుల భాగస్వామ్యం సాధించారు. వైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్‌లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో బ్రెవిస్ 30 పరుగులు సాధించడంతో విజయానికి కావలసిన రన్‌రేట్ బాగా తగ్గిపోయింది. ఆ తరువాత ధోనీ మరియు శివం దూబే చెన్నై జట్టుకు విజయాన్ని అందించారు. ఈ ఓటమితో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సెమీస్ అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

for more IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *