IPL 2025 మ్యాచ్ నెం. 59లో పంజాబ్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్ అవకాశాన్ని మెరుగుపర్చుకుంది. బౌలింగ్‌లో అద్భుతమైన ఆటతీరు తో ఆకట్టుకున్న హర్ప్రీత్ బ్రార్ 3 కీలక వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ద మాచ్ అవార్డు అందుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

తడబడీ నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు
మ్యాచ్ ఆరంభం లోనే పంజాబ్ కింగ్స్ జట్టు వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి 58-3 పరుగులు సాధించింది. ఈ సీజన్ మంచిగా రాణించిన ప్రియాంశ్ ఆర్య మరియు ప్రభసిమ్రన్ సింగ్ తక్కువ స్కోర్‌కే అవుట్ అవ్వగా, ఓవెన్ కూడా త్వరగా అవుట్ అయ్యాడు. ఈ పరిస్థితిలో నీహాల్ వాధేరా మరియు శ్రేయాస్ అయ్యర్ 67 పరుగుల భాగస్వామ్యం నిలిపారు. ఆ తరువాత శశాంక్ సింగ్ మరియు ఓమర్‌జాయ్ వేగంగా పరుగులు సాధించి పంజాబ్ జట్టు స్కోరును 219 పరుగులకు చేర్చారు. 70 పరుగులు సాధించిన నీహాల్ వాధేరా టాప్ స్కోరర్‌గా నిలవగా, 59 పరుగులతో శశాంక్ సింగ్ రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండే 2 వికెట్లు సాధించగా, మాఫకా, రియాన్ పరాగ్ మరియు ఆకాశ్ మాధ్వాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
గెలుపు దిశగా సాగి ఓటమితో ముగించి

220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు అధిరిపోయే ఆరంభం అందుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్లు జైస్వాల్ మరియు సూర్యవంశీ చెలరేగి ఆడగా పవర్‌ప్లే ముగిసేసరికి 1 వికెట్ మాత్రమే కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 89 పరుగులు సాధించింది. ఒక దశలో రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుపు దిశగా సాగింది, కానీ వరుసగా వికెట్లు చేజార్చుకుని ఓటమి పాలైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో జైస్వాల్ మరియు ధృవ్ జురేల్ హాఫ్ సెంచరీలు సాధించినా మిగితా బ్యాట్స్‌మెన్ నుంచి వారికి సహకారం లభించలేదు. పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్‌లో హర్ప్రీత్ బ్రార్ 3 వికెట్లు సాధించగా, జాన్సెన్ మరియు ఓమర్‌జాయ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.
for more IPL updates visit Sports