ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన

Narendra Modi official welcome ceremony at airport

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల మారిషస్ పర్యటనలో భాగంగా మంగళవారం (మార్చి 11) ఉదయం మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌కు చేరుకున్నారు. అక్కడ మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గూలామ్‌తో పాటు ఉప ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నాయకులతో సహా సుమారు 200 మంది అధికార ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Narendra Modi

మారిషస్ – భారతీయ వారసత్వం

మారిషస్ ద్వీప దేశం భారతదేశానికి నైరుతి దిశగా సుమారు 4,685 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది. చారిత్రకంగా పరిశీలిస్తే, 1834 నుండి 1920 వరకు బ్రిటిష్ పాలకులు ఒప్పంద పద్ధతిలో ఉత్తర ప్రదేశ్, బీహార్, తమిళనాడు నుంచి వేలాది మందిని చెరకు తోటల్లో పనిచేయడానికి మారిషస్‌కు పంపించారు. అక్కడే స్థిరపడిపోయిన భారతీయ వంశస్థులు తమ సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ పటిష్టంగా కాపాడుకుంటున్నారు.

మారిషస్‌లో హిందీ, భోజ్‌పురి, తమిళ, తెలుగు, మరాఠీ భాషలు విస్తృతంగా మాట్లాడుతారు. దీపావళి, హోలీ, ఉగాది, తమిళ పుత్తాండు వంటి భారతీయ పండుగలు ఘనంగా నిర్వహించుకుంటారు.

విమానాశ్రయం నుంచి హోటల్‌కు చేరుకున్న వెంటనే అక్కడ ప్రవాస భారతీయులు బీహార్‌కు చెందిన సంప్రదాయ గీత్ గవాయి ప్రదర్శించారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన X (Twitter) ఖాతాలో ఇలా పేర్కొన్నారు:
మారిషస్‌లో భారతీయ సమాజం అందించిన స్నేహపూర్వక ఆతిథ్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి భారతీయ వారసత్వం, సంస్కృతి, విలువలతో ఉన్న బలమైన అనుబంధం నిజంగా ప్రేరణదాయకం. ఈ చారిత్రక, హృదయ సంబంధం తరతరాలుగా మరింత బలపడుతూ కొనసాగుతోంది.”

ప్రధాని మోదీ పర్యటన ముఖ్యాంశాలు

plantaion

రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు నరేంద్ర మోదీ Sir Seewoosagur Ramgoolam Botanical Garden సందర్శించి, అక్కడ “Ek Ped Maa Ke Naam” కార్యక్రమంలో భాగంగా మర్రి మొక్కను నాటారు.

అనంతరం మారిషస్ జాతిపిత, మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన Sir Seewoosagur Ramgoolam Samadhi సందర్శించి నివాళులర్పించారు.

తర్వాత మారిషస్ అధ్యక్షుడు ధర్మబీర్ గోఖూల్‌తో సమావేశమై భారతదేశం భాగస్వామ్యంతో స్థాపించిన ఆయుర్వేద గార్డెన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గంగా జలాన్ని కానుకగా అందించారు.

పరిచయ సందర్భంలో ప్రధాని మోదీ OCI కార్డు ను మారిషస్ అధ్యక్షుడు ధర్మబీర్ గోఖూల్ మరియు మారిషస్ ఫస్ట్ లేడీ బ్రిందా గోఖూల్‌కు అందజేశారు. భారతీయ సంప్రదాయ ప్రకారం ఫస్ట్ లేడీ బ్రిందా గోఖూల్‌కు బనారసీ చీరను కానుకగా అందించారు. బనారసీ చీర వారణాసి సంస్కృతి, విలాసితకు ప్రతీకగా నిలుస్తుంది.

అత్యున్నత పురస్కారం – GCSK ప్రధాని మోదీకి గౌరవం

మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్‌గూలామ్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి “Grand Commander of the Order of the Star and Key of the Indian Ocean” (GCSK) పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడిగా ప్రధాని మోదీ నిలిచారు. ఇది మోదీకి లభించిన 21వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం.

ఈ పర్యటన ద్వారా భారత్-మారిషస్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *