ఎన్నో రోజులు ఎదురు చూసిన CRICKET పండుగ ఈరోజు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమైంది. ప్రముఖ లీగ్ ప్రారంభానికి ముందు సెలెబ్రిటీలు ఆరంభ వేడుకల్లో ఆటపాటలతో అలరించారు. IPL 2025 సీజన్ 18 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్లు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడింది. ముందుగా టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నారు.
రహానే సూపర్ ఇన్నింగ్స్:
మ్యాచ్ ప్రారంభమైన తొలి ఓవర్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వికెట్ లభించింది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రారంభంలో కాస్త తడబడిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు మెల్లగా పుంజుకొని 4, 5 మరియు 6వ ఓవర్లలో 16, 15, 20 పరుగులు సాధించారు. KKR కెప్టెన్ రహానే అద్భుత ఆటతో అలరించగా, పవర్‌ప్లే ముగిసే సమయానికి KKR జట్టు 60 పరుగులు చేసింది. కేవలం 25 బంతుల్లోనే రహానే అర్ధశతకం నమోదు చేశాడు.
రహానే, నరైన్‌ల రెండో వికెట్ భాగస్వామ్యంతో 103 పరుగులు జోడించారు. ఆ తర్వాత 44 వ్యక్తిగత స్కోర్ వద్ద రసిక్ సలామ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ద్వారా వికెట్ కోల్పోయిన వెంటనే, క్రుణాల్ పాండ్యా రహానే వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, రస్సెల్ వికెట్లు కోల్పోయింది. అయితే రఘువంశీ 30 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన RCB బౌలర్లు KKR జట్టును 174 పరుగులకే కట్టడి చేశారు. RCB బౌలింగ్‌లో క్రుణాల్ పాండ్యా 3 వికెట్లు, హేజిల్‌వుడ్ 2 వికెట్లు, యశ్ దయాల్, రసిక్ సలామ్, సుయాష్ శర్మ తలో వికెట్ సాధించారు.
RCB అద్భుత ఆరంభం:
చేదన ప్రారంభించిన RCB ఓపెనర్లు కోహ్లీ మరియు సాల్ట్ కళ్లుచెదిరే ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి RCB జట్టు 80 పరుగులు చేసింది. సాల్ట్ 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి, 56 వ్యక్తిగత స్కోర్ వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ సమయంలో మొదటి వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం జోడించింది. ఆ తర్వాత పడిక్కల్ 10 పరుగుల వద్ద నరైన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు.

ఇన్నింగ్స్ 13వ ఓవర్లో 30 బంతుల్లో కోహ్లీ అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత RCB కెప్టెన్ రజత్ పాటిదార్ వేగంగా పరుగులు చేసి, 16 బంతుల్లో 34 వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ అరోరా బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యం అందించారు. చివర్లో లివింగ్‌స్టోన్ 2 ఫోర్లు, 1 సిక్స్ బాది, మ్యాచ్‌ను 22 బంతులు మిగిలి ఉండగానే Bangalore విజయం సాధించింది. KKR బౌలింగ్‌లో అరోరా, వరుణ్ మరియు నరైన్ తలో వికెట్ తీశారు.
TEAM | P | W | L | NRR |
RCB | 1 | 1 | 0 | 2.137 |
KKR | 1 | 0 | 1 | -2.137 |
for more IPL updates check Sports