Headlines

ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

delhi

IPL 2025 మ్యాచ్ నెం.4 లో ఢిల్లీ క్యాపిటల్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీ పడింది. హోరాహోరీగా జరిగిన పోరులో క్యాపిటల్స్ పైచేయి సాధించింది. మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగింది. చివరలో క్యాపిటల్స్ జట్టు 1 వికెట్ తేడాతో 3 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అశుతోష్ శర్మ (66 పరుగులు) అద్భుత బ్యాటింగ్‌తో ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఆరంభం నుంచే దూకుడుగా లక్నో

మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన లక్నో జట్టు ఓపెనర్లు మిచెల్ మార్ష్ మరియు మార్క్రమ్ మొదటి వికెట్‌కి 46 పరుగులు జోడించారు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్రమ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పూరన్ కూడా ఆరంభం నుంచే బంతిని బాదటం ప్రారంభించాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి లక్నో జట్టు స్కోరు 64/1 వద్ద ఉంది.

పూరన్ తో కలిసి మార్ష్ పరుగుల మోత మోగించగా, ఈ ఇద్దరూ కలిసి 42 బంతుల్లో 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 133 పరుగుల వద్ద లక్నో జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో మార్ష్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత స్టబ్్స్ వేసిన ఓవర్‌లో పూరన్ వరుసగా 4 సిక్సులు, 1 ఫోర్‌తో 28 పరుగులు రాబట్టాడు. 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పూరన్ బౌల్డ్ అవగా, లక్నో జట్టు 15 ఓవర్లలో 169/4 పరుగుల వద్ద నిలిచింది.

ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన లక్నో జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 209/8 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్‌లో స్టార్‌క్ 3 వికెట్లు, కుల్దీప్ 2 వికెట్లు, విప్రజ్, ముకేశ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

తొందరపడి తడబడి, కానీ చివరికి గెలిచిన ఢిల్లీ

210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. వరుసగా వికెట్లు కోల్పోయిన క్యాపిటల్స్ జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే షార్దూల్ 2 వికెట్లు తీశాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి క్యాపిటల్స్ జట్టు 58/4 వద్ద నిలిచింది.

క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో ఫాఫ్ డుప్లెసిస్ మరియు అక్షర్ పటేల్ 42 పరుగుల భాగస్వామ్యం అందించగా, స్టబ్్స్ (34 పరుగులు) మరియు విప్రజ్ నిగమ్ (39 పరుగులు) తో కలిసి అద్భుత ఆటతీరు ప్రదర్శించిన అశుతోష్ శర్మ (66 పరుగులు) ఢిల్లీ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

లక్నో బౌలింగ్‌లో షార్దూల్, సిద్ధార్థ్, దిగ్వేష్ మరియు బిష్నోయ్ తలో 2 వికెట్లు తీశారు.

For more sports update visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *