Headlines

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.10 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో 24 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఆరంభంలోనే తడబడిన సన్‌రైజర్స్

బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సన్‌రైజర్స్ జట్టుకు క్యాపిటల్స్ జట్టు షాక్ ఇచ్చింది. అద్భుతమైన బౌలింగ్‌తో ఢిల్లీ బౌలర్లు వికెట్లు సాధించారు. మిచెల్ స్టార్క్ మొదటి ఓవర్‌లోనే అభిషేక్ శర్మను ఔట్ చేయగా, 3వ ఓవర్లో ఇషాన్ కిషన్ మరియు నితీష్ కుమార్ వికెట్లను కూడా పడగొట్టాడు. ఆ తరువాత పవర్‌ప్లేలో వరుసగా మూడో ఓవర్ వేసిన స్టార్క్, ట్రావిస్ హెడ్ వికెట్ కూడా తీసుకోగా, పవర్‌ప్లే ముగిసే సమయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 58/4 స్కోరు చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్

ఆ తరువాత హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ స్కోరు బోర్డును ముందుకు నడిపించగా, వీరిద్దరి భాగస్వామ్యంతో 77 పరుగులు వచ్చాయి. ఆ వెంటనే క్లాసెన్ 32 పరుగుల వద్ద ఔట్ కావడంతో, సన్‌రైజర్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన యువ ఆటగాడు అనికేత్ వర్మ (74 పరుగులు) సన్‌రైజర్స్ జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ 5 వికెట్లు సాధించగా, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు మరియు మోహిత్ శర్మ 1 వికెట్ తీసుకున్నారు.

ఆధిపత్యం ప్రదర్శించిన ఢిల్లీ క్యాపిటల్స్

164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ఫాఫ్ డుప్లెసిస్ మరియు ఫ్రేజర్ మెక్‌గుర్క్ కలిసి పవర్‌ప్లే ముగిసే సమయానికి 52 పరుగులు జోడించారు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న డుప్లెసిస్, అన్సారీ బౌలింగ్‌లో ఔట్ కావడంతో 81 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అదే ఓవర్లో మెక్‌గుర్క్ కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు.ఆ తరువాత 12వ ఓవర్‌లో అన్సారీ బౌలింగ్‌లో రాహుల్ బౌల్డ్ కాగా, పోరెల్ మరియు స్టబ్‌స్ కలిసి మ్యాచ్‌ను ముగించారు. సన్‌రైజర్స్ బౌలింగ్‌లో అన్సారీ 3 వికెట్లు తీసుకున్నా, మిగతా బౌలర్లు నిరాశపరిచారు.

For IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *