📈 ఈ రోజు Stock Market లో:
➡ SENSEX – 75,364 (-930 పాయింట్లు)
➡ NIFTY 50 – 22,904 (-345 పాయింట్లు)
➡ BANK NIFTY – 51,502 (-94 పాయింట్లు)
ఈ రోజు ఉదయం SENSEX (-272 పాయింట్లు) మరియు NIFTY 50 (-116 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిస్పందనా సుంకంపై చైనా కూడా 36% టాక్స్ పెంచే విధంగా నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా టారిఫ్ అంధోళనల ప్రభావం ఉండటంతో ఈ రోజు మార్కెట్లు బాగా దెబ్బతిన్నాయి.

అమెరికాలో ఫార్మాస్యూటికల్స్ రంగం దిగుమతులపై భారీ మొత్తంలో టారిఫ్ పెంచనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. ఈ గ్లోబల్ ట్రేడ్ వార్ కారణంగా ఆయిల్ ధరలు నాలుగు సంవత్సరాల కనిష్ట రేట్లకు పడిపోయాయి. ఈ రోజు Stock Market లో మెటల్ రంగం భారీగా నష్టపోగా, ఫార్మా, ఆయిల్ & గ్యాస్, ఎనర్జీ మరియు ఐటీ రంగాలు నష్టాలను ఎదుర్కొన్నాయి.
📌 కార్పొరేట్ అప్డేట్స్:
➡ Quess Corp Limited కంపెనీ డీమర్జింగ్ తేదిని ప్రకటించింది. 15-ఏప్రిల్-2025 రికార్డ్ తేదీగా, 15-ఏప్రిల్-2025 ఎక్స్-డేట్‌గా నిర్ణయించారు.
➡ డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ రోజు కాస్త బలహీనపడింది.
ఈ రోజు Stock Market టాప్ గైనర్స్ ⬆️
- Marico ⬆️ +2.47%
- InterGlobe Aviation ⬆️ +1.90%
- Tata Consumer Products ⬆️ +1.57%
- Max Financial ⬆️ +1.50%
- Max Healthcare ⬆️ +1.46%
ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️
- Hind Copper ⬇️ -9.13%
- NALCO ⬇️ -8.66%
- Vedanta ⬇️ -8.66%
- Tata Steel ⬇️ -8.61%
- Bharat Forge ⬇️ -8.15%
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.82
🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹9,164
for more stock market updates visit Markets