AP CM Chandrababu Naidu గారు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సభ్యుని వివాహ మహోత్సవంలో పాల్గొనడానికి వెళ్లి, మార్చి 19న మైక్రోసాఫ్ట్ స్థాపకుడు Bill Gates తో సమావేశం అయ్యారు.
Chandrababu-Bill Gates భేటీ

సమావేశంలో పలు అంశాల పై చర్చలు జరిగినట్లు సమాచారం. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ సహకారం తో ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం మరియు ఉపాధి కల్పన వంటి సేవ రంగాలలో IT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో సహకారానికి సంబంధించి AP CM Chandrababu-Bill Gates సమక్షంలో ఎమ్‌ఓయూ (MoU) ను మార్పిడి చేసుకున్నారు. 2047 స్వర్ణ ఆంధ్ర అభివృద్ధే లక్షం గా గేట్స్ ఫౌండేషన్ తో కలిసి పని చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు తమ సహాయ సాకారాలు ఉంటాయని బిల్ గేట్స్ ఈ సమావేశం లో తెలిపారని ఏపీ సీఎం చంద్రబాబు గారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరియు సంక్షేమం కోసం Gates Foundation తో సమర్థవంతమైన చర్చలు జరిపినట్టు X (formerly Twitter) అకౌంట్ లో ఈ విధంగా పంచుకున్నారు.
ఉద్యోగ రంగంలో, పర్యావరణాలపై AI వినియోగాన్ని పెంచడం, ఉత్పత్తిని పెంచడం మరియు ఉద్యోగ కల్పన పై దృష్టి పెట్టడం ముఖ్యంగా ఉంటుంది.
గతం లో ముఖ్యమంత్రి Chandrababu గారు మరియు Bill Gates కలయిక తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపన తో ఐటీ వేగంగా అభివృద్ధి చెంది లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు వీరి భేటీ అన్ని వర్గాల్లో ను చర్చనీయాంశం గా మారింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగ కల్పన పట్ల చాలా ఆశలు వెల్లువెత్తున్నాయి.
For more updates check News
❤️🥳❤️
Good move if it happens, keep up updating us ❤️