Headlines

IPL 2025: ముంబై పై CSK విజయం

CSK

IPL 2025 సీజన్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో CSK 4 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది.IPL‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగే సమరాన్ని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ముందుగా టాస్ గెలిచిన CSK జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

తడబడిన ముంబై ఇండియన్స్

సీజన్లో ఓపెనింగ్ మ్యాచ్ లో ప్రతిసారి లాగానే ఈ మ్యాచ్‌లో కూడా ముంబై తడబడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో ముంబై జట్టు రికెల్టన్ మరియు విల్ జాక్స్ వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై జట్టు 52/3 స్కోర్ సాధించింది.

CSK

తర్వాత ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి తిలక్ వర్మ 51 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అయితే 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ స్టంపౌట్ అయ్యాడు. 13వ ఓవర్లో తిలక్ మరియు రాబిన్ మిన్జ్ వికెట్లను నూర్ అహ్మద్ తీసుకున్నాడు.

ఇన్నింగ్స్ చివర్లో దీపక్ చాహర్ హిట్టింగ్ చేయడంతో ముంబై జట్టు 20 ఓవర్లలో 155 పరుగులు చేయగలిగింది. CSK బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసుకోగా, ఖలీల్ అహ్మద్ 3, నాథన్ ఎలిస్ మరియు అశ్విన్ చెరో వికెట్ సాధించారు.

సూపర్ కింగ్స్ శుభారంభం

రెండో ఇన్నింగ్స్‌లో చేధన ప్రారంభించిన CSK, ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ రాహుల్ త్రిపాఠి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రచిన్ రవీంద్రతో కలిసి చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్కోర్‌బోర్డును ముందుకు నడిపించాడు. పవర్‌ప్లే ముగిసే సరికి చెన్నై జట్టు 62/1 పరుగులు చేసింది. అద్భుతమైన ఆటతో రుతురాజ్ గైక్వాడ్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

CSK

అయితే, డెబ్యూట్ బౌలర్ విఘ్నేశ్ పుత్తూర్ 3 ఓవర్లలో 3 వికెట్లు తీసుకునే సమయానికి చెన్నై జట్టు 107/4 వద్ద నిలిచింది. ఆ వెంటనే సామ్ కరన్ బౌల్డయ్యాడు.రచిన్ రవీంద్ర తో కలిసి జడేజా పరుగులు సాధించాడు. చివర్లో జడేజా రనౌట్ అవ్వగా, మహేంద్ర సింగ్ ధోనితో కలిసి రచిన్ రవీంద్ర సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

ముంబై బౌలింగ్‌లో విఘ్నేశ్ 3 వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్ మరియు విల్ జాక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

for more updates on IPL visit sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *