Headlines

Gujarat Titans 3 వికెట్ల తేడాతో ముంబైపై విజయం

Gujarat Titans

IPL 2025 Match No. 56లో Gujarat Titans మరియు Mumbai Indians జట్లు పోటీ పడాయి. వర్షం వల్ల పలు సార్లు అంతరాయం ఏర్పడి, 2వ ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ తగ్గించారు. ఇరు జట్లు విజయాన్ని దక్కించుకోవడానికి అద్భుతమైన కృషిని కనబర్చాయి. DLS ప్రకారం Gujarat Titans జట్టు 3 వికెట్లు మిగిలిన దశలో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన Shubman Gill “మ్యాన్ ఆఫ్ ది అవార్డు” అందుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన Gujarat జట్టు కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

Gujarat Titans

మంచి ఆరంభం లభించినా తడబడిన ముంబై జట్టు

Mumbai Indians జట్టుకు మంచి ఆరంభం లభించింది. పవర్‌ప్లే ముగిసే సరికి Mumbai Indians జట్టు 56-2 పరుగులు సాధించింది. ఆ తర్వాత Suryakumar Yadav మరియు Will Jacks కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నిలిపారు. 53 పరుగులు చేసి Will Jacks టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. Gujarat జట్టు బౌలింగ్‌లో Sai Kishore 2 వికెట్లు సాధించగా, Siraj, Rashid Khan, Arshad Khan మరియు Coetzee తలో వికెట్ దక్కించుకున్నారు.

Gujarat Titans

Gujarat Titans జట్టును కరుణించిన వర్షం

156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన Gujarat జట్టు ఆరంభంలో Sai Sudharsan వికెట్ కోల్పోయినా, Buttler మరియు Gill స్కోర్‌బోర్డ్‌ను ముందుకు నడిపించారు. 72 పరుగుల భాగస్వామ్యం నిలిపారు. ఆ తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన Gujarat జట్టు కష్టాల్లో ఉండగా, వర్షం వల్ల ఒక ఓవర్‌లో 15 పరుగులు సాధించాల్సిన అవసరం వచ్చింది. Tewatia మరియు Coetzee కలిసి Gujarat జట్టుకు విజయాన్ని అందించారు. Mumbai Indians జట్టు బౌలింగ్‌లో Ashwani, Bumrah, Boult తలో 2 వికెట్లు సాధించగా, Chahar 1 వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో Gujarat జట్టు Points Tableలో 1వ స్థానానికి చేరుకుంది.

for more IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *