న్యూజీలాండ్ ప్రధాని భారతదేశానికి రాక

New Zealand Prime minister Christopher Luxon 5 రోజుల (15Mar- 20Mar) అధికారక పర్యటనలో భాగంగా ఆదివారం న్యూ ఢిల్లీ చేరుకున్నారు. వారికి ministry of state మత్స్యకార, పశువైద్య మరియు పాలు పరిశ్రమల మంత్రి S. P. Singh Baghel స్వాగతం పలికారు.
ఢిల్లీ వేదికగా March 17 నుంచి 19 వరకు జరుగుతున్న 10వ “Raisina Dialogue” ప్రధాన అతిథి హాజరుకానున్నారు.
India – New Zealand on FTA
భారత్ మరియు న్యూజీలాండ్ అధికారక ప్రతినిధులు విస్తృత మరియు పరస్పర లాభకరమైన ఉచిత వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement) మీద చర్చలు ప్రారంభించినట్టు వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ వారు తెలిపారు.
కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమ శాఖ మంత్రివర్యులయినా Piyush Goyal గారు ఈవిధంగా X( formerly Twitter) అకౌంట్ లో పోస్ట్ చేసారు.
India – New Zealand ద్వైపాక్షిక సమావేశం
PM Modi మరియు NZ PM Luxon మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య మరియు పెట్టుబడుల ప్రవాహాలను అభినందిచినట్టు మరియు వాటిని ఇంకా విస్తరింపచేయడానికి కొత్త మార్గాలను అన్వేషించాలని పిలుపునిచ్చినట్టు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
2023-24లో, న్యూజీలాండ్ భారతదేశానికి మొత్తం 0.84 బిలియన్ డాలర్ల సరుకులను మరియు సేవలను ఎగుమతి చేసింది, 0.91 బిలియన్ డాలర్ల సరుకులను భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంది.మరియు మొత్తం వాణిజ్య విలువ 1.75 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతదేశం న్యూజీలాండ్ నుండి ఉన్ని , ఇనుము స్టీల్, మరియు అల్యూమినియంలను దిగుమతి చేసుకుంటుంది.మరియు ఆ దేశానికి ప్రాథమికంగా ఔషధాలు, యాంత్రిక యంత్రాలు, వస్త్రాలు మరియు ముత్యాలు, విలువైన రత్నాలు మరియు లోహాలు ఎగుమతి చేస్తుంది.
For more interesting updates check news section
Love from newzeland 🎉🥳