IPL 2025 మ్యాచ్ నం.54 లో లక్నో సూపర్ జైంట్స్ మరియు పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పూర్తిగా ఆధిపత్యం సాధించిన పంజాబ్ కింగ్స్ జట్టు 37 పరుగుల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ ఓపెనర్ ప్రభసిమ్రన్ సింగ్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానానికి చేరుకుంది. ధర్మశాల లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

పంజాబ్ కింగ్స్ టాప్ పెర్ఫార్మెన్స్
పంజాబ్ కింగ్స్ జట్టు ఆరంభంలో వికెట్లు కోల్పోయినా పవర్‌ప్లే ముగిసే సమయానికి 66-2 పరుగులు సాధించింది. చెలరేగి ఆడిన ప్రభసిమ్రన్ సింగ్ 91 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంజాబ్ జట్టు ఇన్నింగ్స్ లో శ్రేయాస్ అయ్యర్ మరియు ప్రభసిమ్రన్ సింగ్ కలిసి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇన్నింగ్స్ చివరలో శశాంక్ సింగ్ వేగంగా పరుగులు సాధించి జట్టు స్కోరును 236 పరుగులకు చేర్చారు. లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ లో ఆకాశ్ సింగ్ మరియు దిగ్వేశ్ రతి 2 వికెట్లు సాధించగా, ప్రిన్స్ యాదవ్ 1 వికెట్ సాధించాడు.
చేసింగ్ లో తడబడ్డ లక్నో సూపర్ జైంట్స్

237 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు పంజాబ్ కింగ్స్ పవర్‌ప్లేలోనే దెబ్బతీసింది. పవర్‌ప్లే ముగిసే సరికి 3 కీలక వికెట్లు కోల్పోయిన లక్నో జట్టు 38-3 పరుగులు సాధించింది. అద్భుతమైన బౌలింగ్ తో పంజాబ్ జట్టు లక్నో బ్యాట్స్‌మన్‌లను కట్టడి చేసింది. ఇన్నింగ్స్ మధ్యలో ఆయుష్ బడోనీ మరియు అబ్దుల్ సమద్ 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా, సాధించాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోవడంతో లక్నో జట్టు ఓటమిపాలైంది. ఈ విజయంతో పంజాబ్ జట్టు సెమీస్ అవకాశాలు మెరుగుపరుచుకోగా, లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు అవకాశాలు తగ్గాయి. పంజాబ్ జట్టు బౌలింగ్ లో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, ఓమర్జాయ్ 2 వికెట్లు సాధించగా, జాన్సెన్ మరియు చహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
for more IPL updates visit Sports