LSG పై ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం

ముంబై ఇండియన్స్

IPL 2025 మ్యాచ్ నం.45లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య పోటీ జరిగింది. లీగ్‌లో ముందుకు వెళ్లే దశలో ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యంగా మారగా, ముంబై ఇండియన్స్ జట్టు పూర్తిగా ఆధిపత్యం చూపిస్తూ లక్నో సూపర్ జెయింట్స్ పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి 2 వికెట్లు తీసి, 29 పరుగులు చేసిన విల్ జాక్స్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

ముంబై ఇండియన్స్

చెలరేగిన ముంబై ఇండియన్స్:

ముంబై ఇండియన్స్ జట్టు పవర్‌ప్లేలో మంచి ఆరంభాన్ని అందుకుంది. కేవలం ఒక వికెట్ కోల్పోయి 66-1 పరుగులు సాధించింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో ఓపెనర్ రికెల్టన్ 58 పరుగులు సాధించగా, సూర్యకుమార్ 54 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో రికెల్టన్ మరియు విల్ జాక్స్ మధ్య 55 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా మంచి సహకారం అందించడంతో ముంబై జట్టు 215 పరుగులు సాధించగలిగింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బౌలింగ్‌లో మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు దక్కించుకోగా, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ మరియు రవి బిష్ణోయి తలో వికెట్ తీసుకున్నారు.

ముంబై ఇండియన్స్

ముంబై బౌలింగ్‌లో బూమ్ బూమ్:

216 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓపెనర్ మార్క్రమ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయినా పవర్‌ప్లేలో 60-1 పరుగులు సాధించింది. లక్నో బ్యాటింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోవడం కారణంగా భాగస్వామ్యాలు ఏర్పడలేదు. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్‌లో 35 పరుగులు చేసిన ఆయుష్ బడోనీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించేందుకు 30 బంతుల్లో 76 పరుగులు అవసరమైన సమయంలో బుమ్రా ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి ముంబై జట్టు విజయం సాధించేందుకు కీలకం అయ్యాడు. ముంబై జట్టు బౌలింగ్‌లో బుమ్రా 4 వికెట్లు, బౌల్ట్ 2 వికెట్లు, విల్ జాక్స్ 2 వికెట్లు మరియు బోష్ 1 వికెట్ సాధించారు.

for more IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *