IPL 2025 మ్యాచ్ నం.61లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మధ్య పోరు జరిగింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో జట్టు ఓటమి చవిచూసి లీగ్ నుండి నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 వికెట్ల తేడాతో 10 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. హిట్టింగ్తో చెలరేగిపోయిన అభిషేక్ శర్మ 20 బంతుల్లో 59 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఎకానా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

బ్యాటింగ్‌లో రాణించిన లక్నో జట్టు
తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో జట్టు ఓపెనర్లు మిచెల్ మార్ష్ మరియు మార్కమ్ పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు సాధించారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మంచి పరుగులు సాధించగా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించలేదు. మిచెల్ మార్ష్ 65 పరుగులు, మార్కమ్ 61 పరుగులు సాధించగా ఇన్నింగ్స్ చివర్లో నికోలస్ పూరన్ 45 పరుగులు వేగంగా చేసి జట్టు స్కోరును 205 పరుగులకి చేర్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌లో ఈషాన్ మలింగ 2 వికెట్లు సాధించగా, హర్ష్ ధూబే, హర్షల్ పాటేల్ మరియు నితీష్ రెడ్డి తలో వికెట్ దక్కించుకున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ షో
206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తడబడకుండా విజయం సాధించింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయినా, మెరుపు ఆరంభాన్ని అందించిన అభిషేక్ శర్మ పవర్‌ప్లే ముగిసేసరికే సన్‌రైజర్స్ జట్టు స్కోరును 72-1 పరుగులకు చేర్చాడు. ఆ తరువాత బిష్ణోయ్ ఓవర్లో వరుసగా 4 సిక్సులు కొట్టి అభిషేక్ 59 పరుగులకు ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 35 పరుగులు, క్లాసెన్ 47 మరియు మెండిస్ 32 పరుగులు చేసి సన్‌రైజర్స్ జట్టుకు విజయాన్ని అందించారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బౌలింగ్‌లో దిగ్వేశ్ 2 వికెట్లు సాధించగా, విలియమ్ మరియు శార్దూల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
for more IPL updates visit Sports