ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాసేవల ప్రయోజనం కోసం రాష్ట్రంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ & విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ WATSAPP గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టారు. MANA MITHRA యాప్ ద్వారా ప్రజలకు సులభంగా ప్రయోజనాలు మరియు ప్రభుత్వ సేవలను అందించడానికి WATSAPP సేవలను ప్రారంభించారు.కొన్ని ముఖ్యమైన చిన్న సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నారా లోకేష్ గారి పాదయాత్రలో భాగంగా గమనించి, టెక్నాలజీ సహాయంతో ఆ సమస్యల పరిష్కారానికి మార్గాన్ని సుగమం చేశారు. ఈ సేవల వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలను పొందడం మరింత సులభతరమైంది.

MANA MITHRA సేవలను పొందగలిగే విధానం
MANA MITHRA WATSAPP సేవల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 36 విభాగాలను ఇందులో సమన్వయం చేసి, 160 రకాల సేవలను అందించింది. ఇందులో భాగంగా:
పురపాలక సేవలు
విద్యా సేవలు
దేవాలయ బుకింగ్ సేవలు
APSRTC సేవలు
రెవెన్యూ శాఖ సేవలు
పోలీసు శాఖ సేవలు
పై విభాగాల్లో భాగంగా హాల్ టికెట్, దర్శనం, టికెట్ బుకింగ్, సర్టిఫికేట్లు, మిస్సింగ్ డాక్యుమెంట్స్, ప్రాపర్టీ సంబంధించిన మరిన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి.
MANA MITHRA వాట్సాప్ మోబైల్ నంబర్ :
ఈ సేవల ద్వారా ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవడానికి 9552300009 నంబర్‌కు WATSAPP లో సేవలను ఎంచుకునే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని, అందులో పేర్కొన్న పౌర సేవల్లో మీ సమస్యకు సంబంధించిన సేవను ఎంచుకోవాలి.ఈ విధానంలో ప్రజలకు అందించే సర్టిఫికేట్లలో QR కోడ్‌ను పొందుపరిచారు. అలాగే, తప్పులు సరిదిద్దుకునే సులభమైన అవకాశాన్ని కూడా కల్పించారు.
త్వరలో మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న సేవలను 360 కి పెంచే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రజలకు, ప్రభుత్వానికి టెక్నాలజీని అనుసంధానించి ప్రజా ప్రయోజనాల పరిష్కార దిశగా ముందడుగు వేసే విధంగా ఈ వాట్సాప్ సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగిస్తోంది.
For more updates check news
Keep up posting valuable information like this 👌