Headlines

Qualifier 1 లో Punjab పై RCB Royal Win

RCB

9 సంవత్సరాల తరువాత Royal Challengers Bengaluru జట్టు ఫైనల్ చేరుకుంది. Qualifier 1 మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధారగొట్టిన RCB జట్టు Punjab Kingsను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరుకుంది. 8 వికెట్ల తేడాతో 60 బంతులు మిగిలుండగానే ఘన విజయం సాధించారు. ఇప్పటివరకు జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లలో 60 బంతులు మిగిలుండగానే విజయం సాధించడం ఇది మొదటి సారి కావడం గమనార్హం. చండీగఢ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన RCB జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

RCB

బౌలింగ్‌లో చెలరేగిపోయిన RCB

IPL 2025లో నేరుగా ఫైనల్ చేరుకోవడానికీ ఇరు జట్లు పోటీ పడగా, ముందుగా బ్యాటింగ్ చేసిన Punjab Kingsను RCB బౌలర్లు కొలుకోలేని దెబ్బతీశారు. బౌలింగ్‌లో పూర్తి ఆధిపత్యం సాధించి Punjab Kingsను 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ చేశారు. Punjab Kings జట్టు పతనం ఇన్నింగ్స్ 2వ ఓవర్లో నుంచే ప్రారంభమైంది. 2వ ఓవర్లో ప్రియాంశ్ ఆర్య 7 పరుగులు వికెట్‌ను యశ్ దయాల్ దక్కించుకోగా, 3వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ప్రభు సిమ్రన్ సింగ్ 18 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా శ్రేయస్ అయ్యర్ 2 పరుగులు మరియు జోష్ ఇంగ్లిస్ 4 పరుగులు హేజిల్‌వుడ్ వెనక్కి పంపాడు. పవర్‌ప్లే ముగిసే సరికి Punjab Kings జట్టు 48/4 పరుగులు చేసింది. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన Punjab Kings జట్టు ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. 26 పరుగులు చేసి మార్కస్ స్టోయినిస్ టాప్ స్కోరర్‌గా నిలవగా, హర్ప్రీత్ బ్రార్ మరియు అజ్మతుల్లా సాధించిన 19 పరుగుల భాగస్వామ్యం టాప్ అవ్వడం విశేషం. RCB జట్టు బౌలింగ్‌లో హేజిల్‌వుడ్ మరియు సుయాష్ శర్మ తలో 3 వికెట్లు సాధించగా, యశ్ దయాల్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ మరియు రోమారియో షెఫర్డ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

RCB

Batting లో అలరించిన RCB

101 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన RCB జట్టు 60 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అలరించిన సుయాష్ శర్మ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. పవర్‌ప్లేలో చెలరేగిపోయిన Royal Challengers Bengaluru ఓపెనర్ ఫిల్ సాల్ట్ 27 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ 12 పరుగులు మరియు మయాంక్ అగర్వాల్ 19 పరుగులు చేసి ఔటయ్యినా, అవసరమైన రన్స్ తక్కువగా ఉండడం వల్ల Punjab Kings బౌలర్లు ఓటమిని తప్పించుకోలేకపోయారు. కైల్ జేమిసన్ మరియు ముశీర్ ఖాన్ తలో వికెట్ దక్కించుకోగా, మిగితా బౌలర్లు నిరాశ పరిచారు. రేపు జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో Gujarat Titans మరియు Mumbai Indians జట్లు పోటీ పడనున్నాయి.

For more IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *