ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, Ramzan తొమ్మిదవ నెలగా పేర్కొనబడింది. ఈ నెల ప్రారంభం కావడానికి చంద్రోదయం సూచికగా ఉంటుంది. చంద్రుడు కనిపించిన వెంటనే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉపవాస దీక్ష (రోజా) పాటించడం ప్రారంభిస్తారు.
Ramzan విశిష్టత

ఈ పవిత్రమైన నెలకు ప్రాముఖ్యతను పెంచే ముఖ్య కారణం, ఖురాన్‌ను అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారిచే ఈ నెలలో అవతరింపచేశారు. అందుకే, Ramzan మాసంలో భక్తి, క్రమశిక్షణ, దైవారాధన, మరియు త్యాగానికి అంకితముగా గడిపేలా ముస్లింలకు ఆదేశించబడింది.ఈ నెలలో, ముస్లింలు ఉపవాస దీక్షతో పాటు, నమాజ్ (ప్రార్థనలు) ఆచరిస్తారు, ఖురాన్‌ను అధికంగా చదువుతారు, మరియు తమ రోజువారీ కార్యకలాపాలను తగ్గించి, ఎక్కువ సమయాన్ని అల్లాహ్ ఆరాధనకు అంకితం చేస్తారు.
Ramzan లో ముఖ్య ఆచారాలు
1.ఉపవాసం (రోజా):
ప్రతి రోజు, సూర్యోదయానికి ముందు ‘సహర్’ భోజనం తీసుకుని, సూర్యాస్తమయం వరకు ఆహారం మరియు ద్రవాలు తీసుకోకుండా ఉపవాసాన్ని పాటిస్తారు. సాయంత్రం, సూర్యాస్తమయానంతరం ‘ఇఫ్తార్’ ద్వారా ఉపవాసాన్ని ముగిస్తారు.
2.జకాత్ (ధనసహాయం):
సంపాదనలో 2.5% భాగాన్ని పేదలకు లేదా అర్హులైన వారికి దానం చేయడం ముస్లింలపై విధిగా అమలవుతుంది. జకాత్ మొత్తాన్ని ఉలేమా (ఇస్లామిక్ పండితులు) మార్గదర్శకత్వంలో లెక్కించి జకాత్ ని చెల్లించాలి.
3.సదఖా (దానం):
సామాజిక సేవలో భాగంగా, Ramzan నెలలో ఎక్కువగా దానధర్మాలు చేస్తారు.
ఫిత్రా: ఈద్ ముందు నిరుపేదలకు ఆర్థిక సహాయంగా అందించాల్సిన ప్రత్యేక దానం.
4.అన్నదానం:
పేదలకు ఆహారం పంపిణీ చేసి, సమాజంలో మానవత్వాన్ని పెంపొందించేందుకు ప్రాముఖ్యత ఇస్తారు.
5.షబ్ ఏ ఖదర్ (శక్తివంతమైన రాత్రి):
Ramzan చివరి 10 రోజుల్లో షబ్ ఏ ఖదర్ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రిగా గుర్తించబడుతుంది. ఈ రాత్రిని “1000 రాత్రుల కంటే శ్రేష్ఠమైన రాత్రి”గా భావిస్తారు. అల్లాహ్ ఆరాధన చేసిన వారికి 1000 నెలల (సుమారు 83 సంవత్సరాలు) పుణ్యం లభిస్తుందని నమ్మకం.
6.ఈద్-ఉల్-ఫితర్:
30 రోజుల Ramzan ఉపవాసాన్ని ముగించిన తర్వాత, ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ అనే పండుగను జరుపుకుంటారు. ఇది ఆనందానికి, కృతజ్ఞతకు, మరియు సామాజిక ఐక్యతకు ప్రతీక.
Ramzan యొక్క సందేశం:
ఈ నెలలో పాటించే నియమాలు ముస్లింలకు క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, మరియు దయను బోధిస్తాయి. అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించడమే కాకుండా, మనిషిగా ఉన్నతమైన జీవిత విలువలను ఆచరించేందుకు Ramzan మాసం మార్గనిర్దేశం చేస్తుంది.
for more updates Explore Firstlook