IPL 2025 Match no 41 సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పూర్తీ ఆధిపత్యం కొనసాగించగా ముంబై ఇండియన్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో 26 బంతులు మిగిలుండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ విజయంతో నెట్ రన్‌రేట్ బాగా మెరుగుపరుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్స్ టేబుల్ లో 3వ స్థానానికి చేరుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

ముంబై ఇండియన్స్ సూపర్ బౌలింగ్
మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును కొలకలేని దెబ్బతీశారు ముంబై బౌలర్లు. SRH జట్టు powerplay లో ముగిసే సమయానికి 24-4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా హెన్రీ క్లాసన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అభినవ్ మనోహర్ మరియు క్లాసన్ కలిసి 99 పరుగుల భాగస్వామ్యం సాధించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో క్లాసన్ 71 పరుగులు సాధించగా, అభినవ్ మనోహర్ 43 పరుగులు సాధించాడు. వీరిద్దరి భాగస్వామ్యం వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 143 పరుగులు చేరుకుంది. ముంబై బౌలింగ్ లో బౌల్ట్ 4 వికెట్లు సాధించగా, చహర్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా మరియు బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.
చేసింగ్‌లో ముంబై డామినేషన్

144 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై జట్టు ఆరంభంలో రెకెల్టన్ వికెట్ కోల్పోయినా, రోహిత్ మరియు విల్ జాక్స్ 64 పరుగుల భాగస్వామ్యం జతచేశారు. జీషాన్ బౌలింగ్ లో జాక్స్ catch out అయిన తర్వాత వేగంగా పరుగులు సాధించిన సూర్యకుమార్ యాదవ్ 40 పరుగులు సాధించగా, గొప్ప ప్రదర్శన కనబరిచిన రోహిత్ శర్మ 70 పరుగులు సాధించి ముంబై జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ముంబై జట్టు సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లో జయదేవ్, ఈషాన్ మాలింగ మరియు జీషాన్ అంసారి చెరో వికెట్ దక్కించుకున్నారు.
for more IPL updates visit Sports