IPL 2025 మ్యాచ్ నెం. 65లో Sunrisers Hyderabad మరియు Royal Challengers Bengaluru జట్లు పోటీ పడాయి. గొప్ప ప్రదర్శన కనబర్చిన Sunrisers Hyderabad జట్టు 42 పరుగుల తేడాతో RCB పై విక్టరీ సాధించింది. ఈ ఓటమితో RCB 3వ స్థానానికి చేరుకుంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్‌లో అద్భుతమైన ఆటతీరు తో ఆకట్టుకున్న Sunrisers జట్టు, RCB టాప్ 2 స్థానం అవకాశాలకు దెబ్బతీసింది. మంచి ప్రదర్శన కనబర్చిన ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 94 పరుగులు చేసి Man of the Match అవార్డు అందుకున్నాడు. ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన Royal Challengers Bengaluru జట్టు కెప్టెన్ జితేష్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

హిట్టింగ్‌తో చెలరేగిపోయిన Sunrisers Hyderabad
ఈ మ్యాచ్‌లో మంచి ఆరంభం అందుకున్న Sunrisers జట్టు పవర్‌ప్లేలో 2 వికెట్లు కోల్పోయినా 71-2 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఒక చివర నుంచి పరుగులు చేస్తూ, మిగితా బ్యాట్స్‌మెన్ హిట్టింగ్ చేస్తూ సహకారం అందించారు. 94 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 34, ట్రావిస్ హెడ్ 17, క్లాసెన్ 24, అనికేత్ వర్మ 26 పరుగులు చేసి, మొత్తం స్కోరు 231/6 పరుగులకు చేర్చారు. RCB బౌలింగ్‌లో రొమారియో షెపార్డ్ 2 వికెట్లు తీయగా, కృనాల్, ఎన్గిడి, సుయాష్, భువనేశ్వర్ ఒక్కొక్క వికెట్ చొప్పున తీశారు.
ఆరంభం అదిరినా, చివరలో తడబడ్డ RCB
RCB జట్టు మంచి ఆరంభం పొందినా విక్టరీ సాధించలేకపోయింది. ఇన్నింగ్స్ చివర్లో తడబడిన బ్యాట్స్‌మెన్ 42 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. పవర్‌ప్లే ముగిసేసరికి RCB వికెట్ కోల్పోకుండా 72 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, విరాట్ కోహ్లీ 43, జితేష్ శర్మ 24 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.

Sunrisers బౌలింగ్‌లో కమిన్స్ 3 వికెట్లు, ఈషాన్ మలింగ 2 వికెట్లు తీయగా, ఉనద్కట్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, నితీశ్ కుమార్ ఒక్కొక్క వికెట్ తీశారు.
for more IPL updates visit Sports