Headlines
గుజరాత్ టైటన్స్

టేబుల్‌ టాపర్స్ పోరులో గుజరాత్ టైటన్స్ విజయం

IPL 2025లో శనివారం రోజున డబుల్‌ హెడ్డర్‌లో భాగంగా మధ్యాహ్నం నిర్వహించిన మ్యాచ్‌లో ఢిల్లీ కాపిటల్స్ మరియు గుజరాత్ టైటన్స్ తలపడిన మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఇరు జట్లు విజయం కోసం పోటీపడగా, గుజరాత్ టైటన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో 4 బంతులు మిగిలినవేళ విజయాన్ని అందుకుంది. టార్గెట్ చేధనలో అద్భుతంగా ఆడిన గుజరాత్ ఆటగాడు జాస్ బట్లర్ 97 పరుగులతో మెరిసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి స్కోరు సాధించిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు: ఢిల్లీ కాపిటల్స్ జట్టు పవర్‌ప్లేలో వికెట్లు కోల్పోయినా అవసరమైన రన్‌రేట్‌తో ఆట కొనసాగించింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ మరియు కేఎల్ రాహుల్ వేగంగా పరుగులు సాధించారు. అర్షద్ ఖాన్…

Read More
పంజాబ్ కింగ్స్

RCBపై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం

IPL 2025 మ్యాచ్ నం.34లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ మధ్య పోరు జరిగింది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడగా, ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు పరిమితం చేశారు. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు అద్భుతమైన బౌలింగ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కట్టడి చేసి, 5 వికెట్ల తేడాతో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. గొప్ప బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చిన టిమ్ డేవిడ్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరంభం నుంచే తడబడింది. పవర్‌ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ క్యాచ్ అవుట్ అయ్యారు. వరుసగా వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. బెంగళూరు…

Read More
8 వికెట్ల

8 వికెట్ల తేడాతో కోల్‌కతా చేతిలో CSK ఘోర పరాజయం

IPL 2025 మ్యాచ్ నం 25 లో Kolkata Knight Riders మరియు Chennai Super Kings తలపడ్డాయి. అద్భుతమైన ఆటతో అలరించిన Kolkata Knight Riders జట్టు Chennai Super Kings ను 8 వికెట్ల తేడాతో 59 బంతులు మిగిలుండగానే చిత్తుగా ఓడించింది. గొప్ప ప్రదర్శనతో చెలరేగిన KKR జట్టు ఆల్‌రౌండర్ Sunil Narine మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చెన్నై చెపాక్ వేదికలో చోటు చేసుకున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన Kolkata Knight Riders జట్టు కెప్టెన్ Ajinkya Rahane ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. Kolkata Knight Riders అద్భుత బౌలింగ్ ప్రదర్శన ఈ సీజన్‌లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న చెన్నై జట్టును KKR ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. పటిష్టమైన బౌలింగ్ విభాగం కలిసిన KKR జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయిన CSK…

Read More
గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ పై విజయం

IPL 2025 మ్యాచ్ నం. 19 గుజరాత్ టైటాన్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు పూర్తిగా ఆధిపత్యం సాధించి సన్‌రైజర్స్ పై 7 వికెట్ల తేడాతో 20 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన గుజరాత్ జట్టు బౌలర్ మొహమ్మద్ సిరాజ్ మాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. పవర్‌ప్లేలో గొప్ప ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ జట్టు ని కట్టడి చేశారు. హైదరాబాద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచిన గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నారు. బౌలింగ్‌తో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో వరుసగా 4వ మ్యాచ్ లో ఓటమిపాలైంది. పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన గుజరాత్ జట్టు బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్…

Read More
ఢిల్లీ క్యాపిటల్స్

కొనసాగిన ఢిల్లీ క్యాపిటల్స్, విజయ యాత్ర 24 పరుగుల తేడాతో CSKపై విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ తలపడ్డాయి. వరుసగా 3వ మ్యాచ్‌లో సత్తా ఛాటిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌పై 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన KL రాహుల్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నారు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్‌లో ఆదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్: మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు, తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఫ్రేసర్ మెక్‌గర్క్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన KL రాహుల్ మరియు అభిషేక్ పోరేల్ పవర్‌ప్లే ముగిసే సమయానికి 51/1 పరుగులు సాధించారు. అభిషేక్ పోరేల్ 33 పరుగులు చేసి ఔట్ కాగా, అక్షర్ పటేల్ 21 పరుగులు,…

Read More
లక్నో సూపర్ జెయింట్స్

ముంబయిని చిత్తు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠ పోరులో 12 పరుగులతో విజయం 

IPL 2025 మ్యాచ్ నం 16 లక్నో సూపర్ జెయింట్స్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య జరిగింది. ఇరు జట్లు గొప్ప ప్రదర్శన కనబరిచిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది. అద్భుతంగా బౌలింగ్ చేసిన లక్నో జట్టు బౌలర్ దిగ్వేష్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఏకానా స్టేడియం వేదికగా చోటు చేసుకున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి స్కోర్ సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్స్ మిచెల్ మార్ష్ మరియు ఐడెన్ మార్క్రమ్ బాగా రాణించారు. హిట్టింగ్ చేస్తూ పవర్‌ప్లేలో సత్తా ఛాటిన మిచెల్ మార్ష్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లే ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్…

Read More
కోల్‌కతా నైట్ రైడర్స్

80 పరుగుల తేడాతో SRH ని చిత్తు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

IPL 2025 మ్యాచ్ నం. 15 సన్‌రైజర్స్ హైదరాబాదు మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన నైట్ రైడర్స్ జట్టు 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ అరోరా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట వికెట్లు కోల్పోయినా మిడిల్ ఆర్డర్ నిలబెట్టారు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆరంభంలో ఓపెనర్ వికెట్లను కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి 53/2 పరుగుల స్కోర్ సాధించగలిగింది. ప్రారంభంలో రాణించిన పాట్ కమిన్స్ మరియు మొహమ్మద్ షమీ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత రఘువంశీ మరియు నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానే కలిసి 81 పరుగుల…

Read More
గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.14లో గుజరాత్ టైటాన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఇరు జట్లు మంచి ప్రదర్శన కనబరిచిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో 13 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన మహమ్మద్ సిరాజ్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డును అందుకున్నాడు. చిన్నస్వామి మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో దెబ్బతిన్న RCB మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్‌ప్లేలోనే ఆ జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ 7, పదిక్కల్ 4, ఫిల్ సాల్ట్ 14 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసి…

Read More
పంజాబ్ కింగ్స్

లక్నో పై 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ సూపర్ విజయం

IPL 2025 మ్యాచ్ నం. 13లో పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడింది. గొప్ప ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై 8 వికెట్ల తేడాతో 22 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఎకానా క్రికెట్ స్టేడియంలో చోటు చేసుకున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తడబడిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే లక్నో జట్టు ఓపెనర్ మిచెల్ మార్ష్ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత 4వ ఓవర్లో మార్క్రామ్ బౌల్డ్ అవ్వగా, LSG కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి నిరాశపరిచాడు. ఆ…

Read More
రాజస్థాన్

చెన్నై సూపర్ కింగ్స్ పై  రాజస్థాన్ రాయల్స్  6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం

IPL 2025 మ్యాచ్ నం.11 లో రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఆదివారం జరిగిన డబుల్ హెడ్డర్ మ్యాచ్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. నితీశ్ రాణా మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. బార్సాపారా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభారంభం అందుకున్న రాజస్థాన్ రాయల్స్: రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి ఓవర్లోనే ఓపెనర్ జైస్వాల్ వికెట్‌ను కోల్పోయింది. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో జైస్వాల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ మరియు నితీశ్ రాణా స్కోర్‌బోర్డ్‌ను ముందుకు నడిపించారు. నితీశ్ రాణా చెలరేగి ఆడి 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు….

Read More