Headlines
ఢిల్లీ క్యాపిటల్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.10 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో 24 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే తడబడిన సన్‌రైజర్స్ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సన్‌రైజర్స్ జట్టుకు క్యాపిటల్స్ జట్టు షాక్ ఇచ్చింది. అద్భుతమైన బౌలింగ్‌తో ఢిల్లీ బౌలర్లు వికెట్లు సాధించారు. మిచెల్ స్టార్క్ మొదటి ఓవర్‌లోనే అభిషేక్ శర్మను ఔట్ చేయగా, 3వ ఓవర్లో ఇషాన్ కిషన్ మరియు నితీష్ కుమార్ వికెట్లను కూడా పడగొట్టాడు. ఆ తరువాత పవర్‌ప్లేలో…

Read More
గుజరాత్

ముంబైపై 36 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025 మ్యాచ్ నం.9లో గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడింది. పూర్తి ఆధిపత్యం సాధించిన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన టైటాన్స్ జట్టు బౌలర్ ప్రసిద్ధ్ క్రిష్ణా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించిన టైటాన్స్: గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్‌ను దూకుడుగా ఆరంభించింది. టైటాన్స్ జట్టు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ పవర్‌ప్లే ముగిసే సమయానికి 66 పరుగులు చేశారు. ఆ తరువాత, 9వ ఓవర్లో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ బౌలింగ్‌లో గిల్ క్యాచ్ అవుట్ కావడంతో, బట్లర్‌తో కలిసి…

Read More
రాయల్ ఛాలెంజర్స్

చెన్నైసూపర్ కింగ్స్ పై 50 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం

IPL 2025 మ్యాచ్ నెం.8 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఇరుజట్లూ గొప్ప ఆటతీరు కనబరిచినఈ మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 50 పరుగుల తేడాతో ఛెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. పదహారు సంవత్సరాల తరువాత చెన్నై జట్టుపై చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడగా, విరాట్ కోహ్లీ కొంచెం తడబడ్డాడు. 5వ ఓవర్లో ఫిల్ సాల్ట్ (32 పరుగులు) నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యే సమయానికి వీరిద్దరి జోడీ 45 పరుగులు జోడించింది. పవర్‌ప్లే ముగిసే సరికి…

Read More
లక్నో

సన్‌రైజర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ

ఐపీఎల్ 2025 మ్యాచ్ నెం.7: లక్నో సూపర్ జెయింట్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడింది. మ్యాచ్ ఆరంభం నుంచి గొప్ప ప్రదర్శన కనబరిచిన లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో 23 బంతులు మిగిలుండగానే విజయాన్ని చేజిక్కించుకుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో తడబడినా ఆకట్టుకున్న సన్‌రైజర్స్ బ్యాటింగ్: పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన సన్‌రైజర్స్ జట్టు 2వ ఓవర్‌లోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ వికెట్లను కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అభిషేక్ 6 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అవ్వగా, ఇషాన్ కిషన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత నితీష్ కుమార్‌తో కలిసి ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పవర్ ప్లే ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 62/2 స్కోరు…

Read More
కోల్‌కతా

8 వికెట్ల తేడాతో రాయల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం

IPL 2025 మ్యాచ్ No.6 రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీ పడాయి. బార్సాపుర స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లో స్కోరింగ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. స్పిన్ బౌలింగ్ తో నైట్ రైడర్స్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు. ముందుగా టాస్ గెలిచిన కోల్‌కతా జట్టు కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నారు. వరుస వికెట్లు కోల్పోవడంతో తక్కువ టార్గెట్: మొదట బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో రాజస్థాన్ ఓపెనర్ సంజు సాంసన్ (13 పరుగులు) వ్యక్తిగతంగా ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ రియాన్ పరాగ్ తో కలిసి యశస్వి జైస్వాల్ జాగ్రత్తగా ఆడారు. పవర్ ప్లే ముగిసేసమయానికి రాజస్థాన్ జట్టు 54/1 పరుగులు చేసింది. వీరిద్దరి జోడీ కలిసి రెండో…

Read More
పంజాబ్

టైటాన్స్‌పై 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం

IPL 2025 మ్యాచ్ నెం.5లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు ప్రేక్షకులను అలరించాయి. అద్భుతంగా ఆడిన పంజాబ్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 11 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న పంజాబ్ కింగ్స్: మొదట బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ జట్టు 3వ ఓవర్‌లోనే ఓపెనర్ ప్రభసిమ్రన్ సింగ్ వికెట్‌ను రబాడా ఓవర్లో కోల్పోయింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యతో కలిసి స్కోర్‌బోర్డును ముందుకు నడిపించారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి 73/1 పరుగుల స్కోరు చేరుకున్నారు. వీరిద్దరి జోడీ 51 పరుగులు జోడించగా, టైటాన్స్ రెండో వికెట్‌ను దక్కించుకుంది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రియాంశ్ ఆర్య 47 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత…

Read More
delhi

ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

IPL 2025 మ్యాచ్ నెం.4 లో ఢిల్లీ క్యాపిటల్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీ పడింది. హోరాహోరీగా జరిగిన పోరులో క్యాపిటల్స్ పైచేయి సాధించింది. మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగింది. చివరలో క్యాపిటల్స్ జట్టు 1 వికెట్ తేడాతో 3 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అశుతోష్ శర్మ (66 పరుగులు) అద్భుత బ్యాటింగ్‌తో ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా లక్నో మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన లక్నో జట్టు ఓపెనర్లు మిచెల్ మార్ష్ మరియు మార్క్రమ్ మొదటి వికెట్‌కి 46 పరుగులు జోడించారు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్రమ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన…

Read More
CSK

IPL 2025: ముంబై పై CSK విజయం

IPL 2025 సీజన్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో CSK 4 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది.IPL‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగే సమరాన్ని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ముందుగా టాస్ గెలిచిన CSK జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తడబడిన ముంబై ఇండియన్స్ సీజన్లో ఓపెనింగ్ మ్యాచ్ లో ప్రతిసారి లాగానే ఈ మ్యాచ్‌లో కూడా ముంబై తడబడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో ముంబై జట్టు రికెల్టన్ మరియు విల్ జాక్స్ వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై జట్టు 52/3 స్కోర్ సాధించింది. తర్వాత ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి తిలక్ వర్మ 51 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అయితే 29…

Read More
TATA IPL 2025

IPL 2025 సమరం మార్చ్ 22 నుండి ప్రారంభం

Indian Premier League 2025 సమరం మార్చ్ 22 వ తేదీ నుండి ప్రారంభం అవ్వనుంది. IPL 2025 Schedule ప్రకారంగామొత్తం 13 వేదికలలో 10 జట్ల మధ్య జరిగే పోటీతో IPL సందడి చేయనుంది . 74 మ్యాచ్ లతో రెండు నెలలు పైగా సాగే ఈ క్రికెట్ సమరం కోసం భారతదేశం లోని క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సీజన్ లో మొత్తం 12 డబల్ హెడర్ మ్యాచ్ లు జరగనున్నాయి. IPL 18 వ సీజన్ Live Streaming JIO HOTSTAR ద్వారా ప్రసారం చేయబడతాయి. IPL మ్యాచ్ లు 7.30 PM మరియు శని , ఆది వారాల్లో 3.30 PM, 7.30 PM సమయాల్లో ప్రసారం చేయబడతాయి. IPL SEASON 18 – 2025 లో పాల్గొంటున్న జట్లు PLAYOFFS & FINALS లీగ్ దశలో ప్రతి జట్టు 14…

Read More
ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ పై విజయం సాధించి ఛాంపియన్ గా అవతరించింది. అన్ని విభాగాల్లో సమష్టిగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా గెలుపొందింది. ఈ విజయంతో భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత దేశాలు భారత్ – 2002, 2013, 2025పాకిస్తాన్ – 2017శ్రీలంక – 2002 (భారత్తో సంయుక్త విజేత)ఆస్ట్రేలియా – 2006వెస్టిండీస్ – 2004న్యూజిలాండ్ – 2000దక్షిణాఫ్రికా – 1998 ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రధాన టోర్నమెంట్లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి. ఈ టోర్నమెంట్ తొలిసారిగా 1998లో బంగ్లాదేశ్లో నిర్వహించబడింది. ప్రపంచకప్ తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన వన్డే టోర్నమెంట్ గా క్రికెట్ అభిమానులు ఛాంపియన్స్ ట్రోఫీని భావిస్తారు. ఇది 50 ఓవర్ల అంతర్జాతీయ వన్డే క్రికెట్ టోర్నమెంట్, ఇందులో 8 దేశాలు పాల్గొంటాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ…

Read More