రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం
ఐపీఎల్ 2025 మ్యాచు నంబరు 50లో రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య చుట్టు జరిగింది. పూర్తి ఆధిపత్యం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించి 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన రికెల్టన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభారంభం సాధించిన ముంబై ఇండియన్స్ ముంబై జట్టు ఓపెనర్లు రికెల్టన్ మరియు రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై జట్టు వికెట్ కోల్పోకుండా 58 పరుగులు సాధించింది. వీరిద్దరి జోడీ కలిసి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా వేగంగా పరుగులు…